MLA Sanjay Kumar : జగిత్యాల మాస్టర్ ప్లాన్ G.O 238 రద్దు.. కేంద్రం గైడ్ లైన్ ప్రకారమే మాస్టర్ ప్లాన్ : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

కేంద్ర గైడ్ లైన్ ప్రకారం మాస్టర్ ప్లాన్ జోన్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొందరు అధికారుల లోపం వల్ల రైతుల భూములు మాస్టర్ ప్లాన్ లో వివిధ జోన్ వచ్చిందన్నారు.

MLA Sanjay Kumar : జగిత్యాల మాస్టర్ ప్లాన్ G.O 238 రద్దు.. కేంద్రం గైడ్ లైన్ ప్రకారమే మాస్టర్ ప్లాన్ : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

MLA Sanjay Kumar

Jagtial Master Plan : జగిత్యాల మాస్టర్ ప్లాన్ G.O 238 రద్దు చేసినట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. కేంద్రం గైడ్ లైన్ ప్రకారమే మాస్టర్ ప్లాన్ ఉంటుందన్నారు. కొందరు కావాలని రైతులను రెచ్చ గోట్టారని పేర్కొన్నారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ అందరి సహకారంతో మళ్ళీ రివ్యూ చేస్తామని తెలిపారు. పాత మాస్టర్ ప్లాన్ తప్పుల తడకని విమర్శించారు.

మొదటి సారిగా గెలిచిన శాసన సభ్యునిగా, మొదటి కౌన్సిల్ గా జోన్లను రాష్ట్రంలో మొదట మార్పు చేసినట్లుగా పేర్కొన్నారు. కేంద్ర గైడ్ లైన్ ప్రకారం మాస్టర్ ప్లాన్ జోన్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొందరు అధికారుల లోపం వల్ల రైతుల భూములు మాస్టర్ ప్లాన్ లో వివిధ జోన్ వచ్చిందన్నారు.

MLA Haripriya : మా నాయకులు, మంత్రి పువ్వాడను విమర్శిస్తే సహించం.. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యని హెచ్చరించిన ఎమ్మెల్యే హరిప్రియ

మాస్టర్ ప్లాన్ మున్సిపల్ తీర్మానించినప్పుడు అన్ని పార్టీల కౌన్సిలర్లు కూడా ఉన్నారని తెలిపారు. ప్రతి పక్ష నాయకులు రైతులను రెచ్చ గొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.

ప్రజలకు ఇంకా ఏమైనా అపోహలు ఉంటే మాత్రం తొలగించుకోవాలన్నారు. మళ్ళీ రివ్యూ చేసిన తర్వాత, మున్సిపల్ గ్రామ పంచాయతీ తీర్మానం ఉంటేనే ఆమోదం పొందుతుందన్నారు. జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నామని తెలిపారు.