MLA Shankar Naik Wife: షర్మిల హిందూ వివాహ వ్యవస్థను అవహేళన చేసింది.. ఎమ్మెల్యే సతీమణి ఫైర్ ..

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలపై మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మీ ఫైర్ అయ్యారు. షర్మిల నాపేరు ప్రస్తావించి నా వ్యక్తిగత జీవితాన్ని, మనోభావాల్ని దెబ్బతీసిందంటూ ఆరోపించారు.

MLA Shankar Naik Wife: షర్మిల హిందూ వివాహ వ్యవస్థను అవహేళన చేసింది.. ఎమ్మెల్యే సతీమణి ఫైర్ ..

YS Sharmila

MLA Shankar Naik Wife: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలపై మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మీ ఫైర్ అయ్యారు. షర్మిల నాపేరు ప్రస్తావించి నా వ్యక్తిగత జీవితాన్ని, మనోభావాల్ని దెబ్బతీసిందంటూ ఆరోపించారు. తెలంగాణ గడ్డపై షర్మిల తిరుగుతూ విదేశీ సంస్కృతి‌ని ప్రస్తావిస్తోందని అన్నారు. షర్మిల హిందూ సంప్రదాయాలను కించపరిచే విధంగా మాట్లాడిందని, హిందూ వివాహ వ్యవస్థను అవహేళన చేసిందంటూ సీతామహాలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల మీకు మీ తల్లి విజయమ్మ నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ ప్రశ్నించారు. విడాకుల వ్యవస్థ గురించి మీ అమ్మ విజయమ్మను అడిగి తెలుసుకో అంటూ షర్మిలకు ఎమ్మెల్యే సతీమణి సూచించారు.

YS Sharmila Arrest: వై.ఎస్. షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత.. అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్‌కు తరలింపు

ఆడబిడ్డకి వివాహం తర్వాత మెట్టినిల్లు అత్యంత ప్రధానమైనదనే కనీస అవగాహన లేదా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో తిరుగుతూ చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముతున్నావంటూ షర్మిలపై సీతామహాలక్ష్మీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన వ్యక్తిగత విమర్శలపై షర్మిల సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదవడం కాదని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. తెలంగాణ సాధనకోసం ఉద్యమంలో డాక్టర్ సీతామాలక్ష్మి చురుకైన పాత్ర పోషించిందని తెలుసుకో అంటూ షర్మిలకు ఆమె సూచించారు.

YS Sharmila SC, ST Case : వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

ఇదిలాఉంటే.. మహబూబాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిలను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. శనివారం రాత్రి ఆమె బసచేసిన ప్రాంతానికి ఆదివారం ఉదయం వెళ్లిన పోలీసులు.. షర్మిల కార్వాన్‌లోకి వెళ్లి అరెస్టు చేశారు. అనంతరం పోలీసు జీపులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. అయితే, షర్మిలను హైదరాబాద్ తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం మహబూబాబాద్ ఎమ్మెల్యేపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ.. బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో షర్మిలపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమె పాదయాత్రకు అనుమతిని రద్దుచేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు.