MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవితపై ఈడీ ప్రశ్నల వర్షం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. మూడోసారి కవితను విచారించారు ఈడీ అధికారులు.(MLC Kavitha)

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవితపై ఈడీ ప్రశ్నల వర్షం

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. మూడోసారి కవితను విచారించారు ఈడీ అధికారులు. మంగళవారం సుదీర్ఘంగా కవితను 8గంటలకుపైగా క్వశ్చన్ చేశారు. ఈ సందర్భంగా కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు. సౌత్ గ్రూప్ తో సంబంధాలపై ఆరా తీశారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read..Nallamothu Sridhar : ఈడీ చేతిలో ఎమ్మెల్సీ కవిత ఫోన్లు.. ఆ ఫోన్లలోని డేటాను ఎలా సేకరిస్తారు? డిలీట్ చేసిన డేటాని తిరిగి తీసుకోవచ్చా?

అయితే, తాను ఏ తప్పూ చేయలేదని కవిత తేల్చి చెప్పారు. అసలు, లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధమూ లేదని కవిత మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు కవిత ఫోన్లలోని డేటాను విశ్లేషించే పనిలో పడ్డారు అధికారులు. మంగళవారం(మార్చి 21) ఉదయం 10గంటలకు తన 10ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు కవిత. ఆ ఫోన్లను ఐటీ నిపుణులకు అప్పగించారు ఈడీ అధికారులు. ఐటీ నిపుణులు ఫోన్లలోని డేటాను రికవరీ చేసేందుకు యత్నిస్తున్నారు.(MLC Kavitha)

Also Read..Delhi Liquor Scam : MLC కవిత 10 ఫోన్లలో ఏముంది? డిలీట్ అయిన డేటాను కూడా రికవరీ చేసే యత్నంలో ఈడీ

లిక్కర్ స్కామ్ లో 36 మంది నిందితులు 170 ఫోన్లను మార్చినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటివరకు అధికారులు నిందితులకు చెందిన 17 ఫోన్లలో సేకరించిన ఆధారాలతో ప్రభుత్వానికి రూ.2వేల 873 కోట్లు నష్టం జరిగిందని నిర్ధారించారు. మిగతా 153 ఫోన్లలో వివరాలు వెలికితీస్తే స్కామ్ విలువ మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఈడీ చెబుతోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఎమ్మెల్సీ కవితను మూడోసారి కూడా ప్రశ్నించారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో నిర్వహించిన ఈ విచారణ సుదీర్ఘంగా సాగింది. మొత్తం 10 గంటల పాటు ఈడీ కార్యాలయంలో కవిత ఉండగా, ఆమెను 8.30 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ అంటూ కొందరు నేతల పేర్లను ఈడీ పేర్కొంది. అందులో కవిత కూడా ఉన్నారు. ఈ సౌత్ గ్రూప్ ను నియంత్రించింది శరత్ చంద్రారెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట తనయుడు రాఘవ అని ఈడీ ఆరోపిస్తోంది. కాగా, కవిత వాడిన 10 ఫోన్లను ఆధారాలు దొరక్కుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే తన ఫోన్లన్నంటినీ సడెన్ గా కవిత ఈడీ కార్యాలయానికి తీసుకురావడం, వాటిని అధికారులకు సమర్పించడం హాట్ టాపిక్ గా మారింది.