MLC kavitha Liquor Scam : మునుగోడులో టీఆర్ఎస్ ఓటమి ఖాయం..లిక్కర్ స్కామ్ తో సంబంధంలేదని కవిత నిరూపించుకోవాలి : జీవితా రాజశేఖర్

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవటం ఖాయం అంటూ నటి..దర్శకురాలు..సినీ హీరో రాజశేఖర్ భార్య..బీజేపీ నేత అయిన జీవితా రాజశేఖర్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం లేదని కవిత నిరూపించుకోవాలి అని అన్నారు.

MLC kavitha Liquor Scam : మునుగోడులో టీఆర్ఎస్ ఓటమి ఖాయం..లిక్కర్ స్కామ్ తో సంబంధంలేదని కవిత నిరూపించుకోవాలి : జీవితా రాజశేఖర్

Jeevitha Rajashekar sensational comments

MLC kavitha liquor scam : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవటం ఖాయం అంటూ నటి..దర్శకురాలు..సినీ హీరో రాజశేఖర్ భార్య..బీజేపీ నేత అయిన జీవితా రాజశేఖర్ అన్నారు. తెలంగాణలో మునుగోడు రాజకీయాలు హీటెక్కిన ఇంతకాలానికి మరోసారి సడెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చారు జీవిత. ఇప్పటికే పలు పార్టీలు మారి ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నేతగా ఉన్న క్రమంలో సడెన్ గా టీఆర్ఎస్ మునుగోడులో ఓడిపోతుంది అంటూ జోస్యం చెప్పుకొచ్చారు జీవితా రాజశేఖర్.

అంతేకాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత హస్తం ఉంది అనే ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో దీనిపై కూడా జీవితా రాజశేఖర్ విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం లేదని కవిత నిరూపించుకోవాలి అని అన్నారున. అంతేకాదు హైదరాబాద్ లోని పలు క్లబ్లులు,పబ్బుల్లో మంత్రి కేటీఆర్ కు వాటాలు ఉన్నాయని..ఆ విషయాన్ని ఆయా క్లబ్బులు, పబ్బుల యజమానులే చెప్పారని ఇటువంటివారా తెలంగాణాను పాలించేది అంటూ జీవిత విమర్శించారు. బండి సంజయ్ పాద్రయాత్రను అన్యాయంగా అరెస్ట్ చేసి అడ్డుకున్నారని..బండి పాదయాత్రకు అనుమతి ఇవ్వాలి అని ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా బీజేపీని ఏమీ చేయలేరు అని అన్నారామె.

కాగా..ఇప్పటికే పలు పార్టీలు మారిన జీవితా రాజశేఖర్ దంపతులపై ఎన్నో సెటైర్లు వస్తుంటాయి. ఇంకా మారటానికి పార్టీలు మిగిలి ఉన్నాయా? అంటూ చాలామంది ఎద్దేవా చేస్తుంటారు. రాష్ట్ర విభజనకు ముందు 2008లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజశేఖర్ జీవితా దంపతులు. ఆ తర్వాత 2014లో బీజేపీలో చేరారు. ఆ పార్టీ అప్పటి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి బీజేపీ నుంచి జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడం లేదని చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరారు. మళ్లీ కొంతకాలానికే వైసీపీలో చేరారు. అయినా వీరికి ఆశించిన ప్రాధాన్యత లభించకపోవడంతో తెలంగాణ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినీ దంపతుల పార్టీ మార్పుపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తుండటారు. కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, టీడీపీ ఇలా దాదాపు అన్ని పార్టీలనూ చుట్టేసిన ఈ జంటకు ఇక మిగిలింది జనసేన లేదంటే మరో కొత్త పార్టీ పుట్టుక రావాలంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.