MLC Kavitha: పార్లమెంటులో సైతం పోరాటం చేసి తీరతాం: రష్యా వార్తా సంస్థకు కవిత ఇంటర్వ్యూ

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో సైతం పోరాటం చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎటువంటి చొరవ తీసుకోవడం లేదని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీని విస్మరించిందని విమర్శించారు. రష్యా ప్రభుత్వ అధికారిక వార్తాసంస్థ స్పుత్నిక్ కు కల్వకుంట్ల కవిత ఇంటర్వ్యూ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక అంశాలను మాట్లాడారు.

MLC Kavitha: పార్లమెంటులో సైతం పోరాటం చేసి తీరతాం: రష్యా వార్తా సంస్థకు కవిత ఇంటర్వ్యూ

MLC Kavitha

MLC Kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో సైతం పోరాటం చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎటువంటి చొరవ తీసుకోవడం లేదని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీని విస్మరించిందని విమర్శించారు. రష్యా ప్రభుత్వ అధికారిక వార్తాసంస్థ స్పుత్నిక్ కు కల్వకుంట్ల కవిత ఇంటర్వ్యూ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక అంశాలను మాట్లాడారు.

రాజకీయ రంగంలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతేనే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ 2014 ఎన్నికల ముందు మహిళా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఇచ్చిన హామీని విస్మరించిందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని తమ పార్టీ ఎంపీలు తరచూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారని తెలిపారు.

కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. తొలిసారి మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో అప్పటి ప్రధాన మంత్రి దేవే గౌడ పార్లమెంట్లో ప్రవేశపెట్టారని, ఆ తర్వాత వచ్చిన ప్రధాన మంత్రులు ఈ బిల్లును ఆమోదించడానికి ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి ఏ మాత్రం చొరవ చూపలేదని మండిపడ్డారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలో రాజకీయ చిత్తశుద్ధి అవసరమని అన్నారు.

కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరాలు చెబుతున్నాయని, ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి తమ పార్టీ కేంద్రానికి సూచనలు ఇచ్చిందని కవిత తెలిపారు. ముఖ్యంగా కులగణనను చేపట్టి ఓబీసీ జనాభా లెక్కలు తీయాలని తామ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. జనాభా లెక్కలు అందుబాటులో ఉంటే రిజర్వేషన్ల అమలు సులభం అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించి కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించిందని గుర్తు చేశారు.

MLC Kavitha-Delhi liquor scam: నేను సుప్రీంకోర్టులో అటువంటి విజ్ఞప్తి చేయలేదు: ఎమ్మెల్సీ కవిత