Mlc kavitha: వీటికి సమాధానం చెప్పండి అమిత్‌‌షా జీ.. ట్విటర్ వేదికగా కవిత ప్రశ్నల వర్షం..

కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ శివారులోని ...

Mlc kavitha: వీటికి సమాధానం చెప్పండి అమిత్‌‌షా జీ.. ట్విటర్ వేదికగా కవిత ప్రశ్నల వర్షం..

Mlc Kavitha

Mlc kavitha: కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభలో అమిత్‌షా పాల్గొని ప్రసంగిస్తారు. అమిత్‌షా రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా తెరాస నేత, ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.

తెలంగాణ బిడ్డలకు కేంద్రం ఏమిచ్చిందో చెబుతారా అమిత్‌షా జీ అంటూ వివిధ అంశాలపై ప్రశ్నలు సంధిస్తూ కవిత ట్వీట్లు చేశారు. ఈరోజు మీరు తెలంగాణ ప్రజలను కలిసినప్పుడు గత ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఒక్క ఐఐటీ, ఐఐఎమ్‌, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ఐటీ, ఎన్‌ఐడీ, మెడికల్ కాలేజీ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో వివరించాలని కోరారు. రూ. 3వేల కోట్లకుపైగా ఉన్న ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారంటూ ప్రశ్నించారు. అదేవిధంగా బ్యాక్ వర్డ్ రీజియన్ రూ. 1,350 కోట్లు, జీఎస్టీ పరిహారం రూ. 2,247 కోట్ల సంగతేంటి అంటూ అమిత్ షాను కవిత ప్రశ్నించారు.

TRS MLC Kavitha : విమర్శల్ని మహిళా జర్నలిస్టులు ధైర్యంగా ఎదుర్కోవాలి: ఎమ్మెల్సీ కవిత

ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బనానికి మీ సమాధానం ఏమిటని ప్రశ్నించారు. భాజపా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటినుండి పెరిగిన నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై ఏం చెబుతారు అమిత్ షా జీ అంటూ ప్రశ్నించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ. 24,000 కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పండి అంటూ కవిత ప్రశ్నించారు. కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా నిరాకరించడం కేంద్ర ప్రభుత్వం కపటత్వం కాదా అంటూ కవిత అమిత్ షాను నిలదీశారు. వీటన్నింటిపై సమాధానం చెప్పాలని కోరుతున్నట్లు కవిత ట్విటర్‌లో కోరారు.