MLC Kavitha : బ్యాక్ టు హోమ్.. హైదరాబాద్ చేరుకున్న కవిత, కేటీఆర్.. సీఎం కేసీఆర్‌తో భేటీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరైన కవిత.. బుధవారం మధ్యాహ్నం నగరానికి వచ్చారు.(MLC Kavitha)

MLC Kavitha : బ్యాక్ టు హోమ్.. హైదరాబాద్ చేరుకున్న కవిత, కేటీఆర్.. సీఎం కేసీఆర్‌తో భేటీ

MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరైన కవిత.. బుధవారం మధ్యాహ్నం నగరానికి వచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కవిత నేరుగా ప్రగతిభవన్ కు వెళ్లారు. ఆమెతో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ పలువురు నేతలు కూడా హైదరాబాద్ చేరుకున్నారు.

ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో కవిత వచ్చారు. కవితతో పాటు ఢిల్లీ వెళ్లిన మంత్రులు కూడా అదే విమానంలో హైదరాబాద్ కు వచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ప్రగతిభవన్ కు వెళ్లారు. సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈడీ విచారణలో చోటు చేసుకున్న పరిణామాలను సీఎం కేసీఆర్ కు కవిత వివరించారు. రెండు రోజుల ఈడీ విచారణలో కవిత ఎదుర్కొన్న ప్రశ్నలు, తాను ఇచ్చిన సమాధానాలు అన్నింటిపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు కవిత. ఈడీ అధికారులు వ్యవహరించిన తీరును కూడా పూర్తి స్తాయిలో కేసీఆర్ కు వివరించారు. తదుపరి కార్యాచరణకు ఎలా సిద్ధం కావాలన్న అంశంపై సీఎం కేసీఆర్ తో చర్చించారు కవిత.(MLC Kavitha)

Also Read..Nallamothu Sridhar : ఈడీ చేతిలో ఎమ్మెల్సీ కవిత ఫోన్లు.. ఆ ఫోన్లలోని డేటాను ఎలా సేకరిస్తారు? డిలీట్ చేసిన డేటాని తిరిగి తీసుకోవచ్చా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ వ్యవహారంలో.. ఈడీ అధికారులు మూడు దఫాలుగా కవితను విచారించారు. వరుసగా రెండు రోజులు కవితను ఎంక్వైరీ చేశారు. సుదీర్ఘంగా విచారణ జరిగింది. కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. అప్పుడు విచారణ అయిపోలేదని, మరోసారి విచారణకు పిలుస్తామని ఈడీ అధికారులు కవితతో చెప్పినట్లు సమాచారం. మళ్లీ ఈడీ సమన్లు ఇస్తే ఎలా ఎదుర్కోవాలి? అన్న అంశంపైనా కవిత.. కేసీఆర్ తో చర్చించినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఎమ్మెల్సీ కవితను వరుసగా రెండవ రోజూ(మార్చి 21) కూడా ప్రశ్నించారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈ విచారణ నిర్వహించారు. మొత్తం 10 గంటల పాటు కవిత ఈడీ కార్యాలయంలో ఉండగా, 8.30 గంటల పాటు ప్రశ్నించారు. ప్రశ్నల వర్షం కురిపించారు.(MLC Kavitha)

Also Read..Delhi Liquor Scam : MLC కవిత 10 ఫోన్లలో ఏముంది? డిలీట్ అయిన డేటాను కూడా రికవరీ చేసే యత్నంలో ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ అంటూ కొందరు నేతల పేర్లను ఈడీ పేర్కొంది. అందులో కవిత కూడా ఉన్నారు. ఈ సౌత్ గ్రూప్ ను నియంత్రించింది శరత్ చంద్రారెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట తనయుడు రాఘవ అని ఈడీ ఆరోపిస్తోంది. కాగా, కవిత వాడిన పది ఫోన్లను ఆధారాలు దొరక్కుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అయితే సడెన్ గా.. తన ఫోన్లన్నంటినీ ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చిన కవిత.. వాటిని ఈడీ అధికారులకు అప్పగించడం ఆసక్తికర అంశం.

ఈడీ అధికారులు కవితను విచారించడం ఇది మూడోసారి. మంగళవారం సుదీర్ఘంగా కవితను 8గంటలకుపైగా క్వశ్చన్ చేశారు. ఈ సందర్భంగా కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు. సౌత్ గ్రూప్ తో సంబంధాలపై ఆరా తీశారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read..Delhi Liquor Scam : ఈడీ నా ఫోన్లు ఇవ్వమనటం మహిళ స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కలిగించటమే : MLC Kavitha

అయితే, తాను ఏ తప్పూ చేయలేదని కవిత తేల్చి చెప్పారు. అసలు, లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధమూ లేదని కవిత మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు కవిత ఫోన్లలోని డేటాను విశ్లేషించే పనిలో పడ్డారు అధికారులు. మంగళవారం(మార్చి 21) ఉదయం 10గంటలకు తన 10ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు కవిత. ఆ ఫోన్లను ఐటీ నిపుణులకు అప్పగించారు ఈడీ అధికారులు. ఐటీ నిపుణులు ఫోన్లలోని డేటాను రికవరీ చేసేందుకు యత్నిస్తున్నారు.(MLC Kavitha)

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఈ నెల 11న కవిత తొలిసారిగా ఈడీ విచారణకు హాజరయ్యారు. 16న మరోసారి విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు ఇచ్చాక.. 14న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున, మార్చి 24వరకు తనకు గడువు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత.. ఈడీని కోరారు. అయినప్పటికీ కవిత అభ్యర్థనను ఈడీ పరిగణలోకి తీసుకోలేదు. మళ్లీ మార్చి 20న నోటీసులు ఇచ్చింది. దీంతో 20న రెండోసారి ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. ఆ తర్వాత మార్చి 21న మూడోసారి విచారణకు హాజరయ్యారు కవిత.