MLC Kavitha: కాళేశ్వరం భగీరథ ప్రయత్నమే.. కల్వకుంట్ల చంద్ర‌శేఖర్ అనేకంటే కాళేశ్వరం చంద్ర‌శేఖర్‌గా పిలవాలి

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఇలాంటి ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. నిధులు ఇవ్వకపోయినా జాతీయ హోదా ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.

MLC Kavitha: కాళేశ్వరం భగీరథ ప్రయత్నమే.. కల్వకుంట్ల చంద్ర‌శేఖర్ అనేకంటే కాళేశ్వరం చంద్ర‌శేఖర్‌గా పిలవాలి

MLC Kavitha

MLC Kavitha: ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తరువాత సీఎం కేసీఆర్ (CM KCR) సారథ్యంలో తెలంగాణ (Telangana)  లో అన్ని రంగాల్లో అభివృద్ధి  (Development) చెందుతుందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. తెలంగాణ దశాబ్ధి వేడుక (Telangana Decade Celebrations) ల్లో భాగంగా నిజామాబాద్‌ (Nizamabad)లోని న్యూ అంబేద్కర్ భవన్‌లో జరిగిన సాగునీటి దినోత్సవం (Irrigation Day) లో కవిత పాల్గొని ప్రసంగించారు. పదేళ్లలో సాధించిన ప్రగతి సమీక్ష కోసమే దశాబ్ది వేడుకలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్ (Congress) హయాంలో తెలంగాణలో ఇరిగేషన్ రంగానికి ఆశించిన నిధులు రాలేదని, కేసీఆర్ పాలనలో సాగునీటి కోసం పుష్కలంగా నిధులు అందాయని కవిత తెలిపారు.

MLC Kavitha: సీఎం కేసీఆర్ వల్లే ఇవి సాధ్యమయ్యాయి: ఎమ్మెల్సీ కవిత

చేసిన అభివృద్ధి చెప్పే సత్తా కేసీఆర్‌కే ఉందన్నారు. సమైక్య పాలనలో కరువుతో రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కానీ, నేడు ఎక్కడ చూసినా పచ్చని పైర్లతో తెలంగాణ పల్లెలు కళకళలాడుతున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ భగీరథ ప్రయత్నమేనని, కల్వకుంట్ల చంద్ర‌శేఖర్ అనేకంటే కాళేశ్వరం చంద్ర‌శేఖర్‌గా పిలవాలని కవిత పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ పాలనలో కాలువలు తవ్వకుండానే వేలకోట్లు దండుకున్నారని కవిత విమర్శించారు. తాగు నీటికోసంకూడా బిందెలు పట్టుకొని రోడ్లెక్కాల్సి వచ్చిందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించామని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని చెప్పారు.

MLC Kavitha: ఇది కల కాదు కదా..? శుభకార్యంలో పాల్గొని మాట్లాడుకున్న బండి సంజయ్, కల్వకుంట్ల కవిత.. ఏం జరిగిందంటే?

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ కాళేశ్వరం. ఇలాంటి ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. నిధులు ఇవ్వకపోయినా జాతీయ హోదా ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన నాయకుడని, మహారాష్ట్ర‌తో ఒప్పందం వల్లే జల వివాదాలు లేవని కవిత అన్నారు. అంతకు ముందు కవిత మాక్లూర్ గ్రామంలో అయ్యప్ప సహిత, ఆంజనేయ శివ పంచాయతన సహిత శ్రీ రుక్ష్మిణి పాండు రంగ విఠలేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జీవన్ రెడ్డిలతో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.