Delhi Liquor Scam: ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణకు హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠ ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, ఢిల్లీ వెళ్లినప్పటికీ.. కవిత ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 

Delhi Liquor Scam: ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణకు హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠ ..

MLC Kavitha-Delhi liquor scam

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. కవిత వెంట మంత్రి కేటీఆర్, భర్త అనిల్, ఎంపీలు సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావులు ఉన్నారు. ఢిల్లీ వెళ్లినప్పటికీ.. కవిత ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.  లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవిత ఈనెల 11న ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే,  16న మరోసారి విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది.  16న ఢిల్లీ వెళ్లిన కవిత చివరి నిమిషంలో విచారణకు వెళ్లేందుకు నిరాకరించారు. తన ప్రతినిధిని మాత్రమే పంపించారు. 14వ తేదీన ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టు వెళ్లారు. ఈ క్రమంలో కవిత పిటీషన్‌ను సుప్రీంకోర్టు ఈనెల 24న విచారణ చేస్తామని పేర్కొంది. ఈ క్రమంలో తాను దాఖలు చేసిన పిటీషన్‌ను 24న సుప్రీంకోర్టు విచారించనుందని, న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వేచిచూడాలని ఆమె ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

MLC Kavitha Posters : హైదరాబాద్‌లో మళ్లీ పోస్టర్ల కలకలం.. ఈసారి కవితకు వ్యతిరేకంగా

కవిత విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది. ఈ నెల 20న ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని మరోసారి సమన్లు జారీ చేసింది. అంతేకాక, అరుణ్ రామచంద్రపిళ్లై కస్టడీని పెంచాలని కోరుతూ కోర్టులో ఈడీ పిటీషన్ దాఖలు చేసింది. దీంతో పిళ్లై కస్టడీని ఈనెల 20వరకు కోర్టు పొడిగించింది. ప్రస్తుతం, ఈడీ సూచనల మేరకు కవిత ఇవాళ విచారణకు హాజరవుతారా? లేదంటే సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటీషన్ విచారణ పూర్తయ్యే వరకు వేచిచూసే దోరణిని అవలంభిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.

MLC Kavitha : కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈడీ కేవియట్ పిటిషన్

ఒకవేళ ఈడీ ఎదుట ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరైతే.. రామచంద్రపిళ్లై, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీపీ మనీశ్ సిసోడియాలను కలిపి విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనే రామచంద్ర పిళ్లై, కవితను కలిపి విచారిస్తారని ప్రచారం జరిగింది. ఒకవేళ కవిత విచారణకు హాజరుకాకపోతే ఈడీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకొనే అవకాశం ఉందనే విషయంపైనా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదిలాఉంటే, ఎమ్మెల్సీ కవిత కేసులో తమ వాదనలు వినకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరుతూ ఈడీ సుప్రీంకోర్టులో కెవియట్ చేసిన విషయం విధితమే.