Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నోటీసులపై సీబీఐకి కల్వకుంట్ల కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ నిమిత్తం తనకు అందిన నోటీసులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి కల్వకుంట్ల కవిత ఇవాళ లేఖ రాశారు. ఆ కేసులో ఫిర్యాదు కాపీతో పాటు ఎఫ్ఐఆర్‌ కాపీని తనకు అందించాలని సీబీఐని కవిత కోరారు. ఆ తర్వాత విచారణ తేదీని ఖరారు చేయవచ్చని చెప్పారు. సీఎం కేసీఆర్ తో సమావేశం అయిన తర్వాత కవిత సీబీఐకి ఈ లేఖ రాయడం గమనార్హం.

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నోటీసులపై సీబీఐకి కల్వకుంట్ల కవిత లేఖ

MLC Kavitha

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ నిమిత్తం తనకు అందిన నోటీసులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి కల్వకుంట్ల కవిత ఇవాళ లేఖ రాశారు. ఆ కేసులో కేంద్ర ఇచ్చిన ఫిర్యాదు కాపీతో పాటు ఎఫ్ఐఆర్‌ కాపీని తనకు అందించాలని సీబీఐని కవిత కోరారు. ఆ తర్వాత విచారణ తేదీని ఖరారు చేయవచ్చని చెప్పారు. ఇలా చేస్తేనే సమాధానాలు త్వరగా చెప్పేందుకు వీలు ఉంటుందని అన్నారు. సీఎం కేసీఆర్ తో సమావేశం అయిన తర్వాత కవిత సీబీఐకి ఈ లేఖ రాయడం గమనార్హం.

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి వ్యాపారవేత్త అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును పొందుపర్చినట్లు ఇప్పటికే వెల్లడైన విషయం తెలిసిందే. సౌత్ గ్రూప్ నుంచి చెల్లించిన 100 కోట్ల రూపాయలకు కంట్రోలర్ గా శరత్ చంద్ర, కె.కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది.

Bangladesh vs India: ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోలు పోస్ట్ చేసిన షమీ

నిన్న సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ కోసం కవితకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. కేవలం వివరణ కోసమే 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చినట్లు సీబీఐ తెలిపింది. ఢిల్లీ లేదా హైదరాబాద్ లో ఎక్కడ హాజరైనా ఫర్వాలేదు అని నోటీసులో పేర్కొంది. దీనిపై కవిత కూడా స్పందిస్తూ… ‘‘నాకు సీబీఐ నోటీసులు పంపి, వివరణ ఇవ్వాలని చెప్పింది. హైదరాబాద్ లోని నా నివాసం వద్ద నేను ఈ నెల 6న సీబీఐని కలుస్తానని అధికారులకు చెప్పాను’’ అని అన్నారు. ఈ నేఫథ్యంలో ఆమె ఇవాళ సీబీఐకి లేఖ రాసి, ఫిర్యాదు కాపీతో పాటు ఎఫ్ఐఆర్‌ కాపీ కావాలన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..