MLC K Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముగిసిన కవిత విచారణ.. రేపు మరోసారి విచారణకు పిలిచిన ఈడీ అధికారులు

ఉదయం 11.00 గంటల నుంచి ఢిల్లీలోని కార్యాలయంలో కవితను ఈడీ అధికారులు విచారించారు. దాదాపు పదిన్నర గంటలుపైగా కవితను అధికారులు ప్రశ్నించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద కవితను ఈడీ అధికారులు విచారించారు.

MLC K Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముగిసిన కవిత విచారణ.. రేపు మరోసారి విచారణకు పిలిచిన ఈడీ అధికారులు

MLC Kavitha

MLC K Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. సోమవారం రాత్రి 09.00 గంటల తర్వాత కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఉదయం 11.00 గంటల నుంచి ఢిల్లీలోని కార్యాలయంలో కవితను ఈడీ అధికారులు విచారించారు.

Steve Smith: అద్భుతంగా క్యాచ్ పట్టిన స్మిత్.. ‘క్యాచ్ ఆఫ్ ద సెంచరీ’ అంటున్న జహీర్ ఖాన్… వీడియో ఇదిగో!

దాదాపు పదిన్నర గంటలుపైగా కవితను అధికారులు ప్రశ్నించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి కూడా కవితను అధికారులు ప్రశ్నించారు. కవిత విచారణ సందర్భంగా ఈడీ కార్యాలయం వద్ద సాయంత్రం నుంచి ఉత్కంఠ నెలకొంది. విచారణ సందర్భంగా కవిత వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్ర, కవిత ప్రమేయం, ఆధారాల ధ్వంసం వంటి అంశాలపై అధికారులు ప్రశ్నించారు. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎలాంటి ఆధారాలు ధ్వంసం చేయలేదని కవిత చెప్పినట్లు తెలుస్తోంది.

PM Modi: పానీ పూరీ టేస్ట్ చేసిన ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ఫ్యుమియో.. వీడియో వైరల్

ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందనే విషయం కూడా తెలియదని కవిత చెప్పారని సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 11న జరిగిన విచారణ సందర్భంగా కవిత తాను ఇచ్చిన వాంగ్మూలానికి కొనసాగింపుగానే, ఈ రోజు కూడా తన వాదన వినిపించినట్లు తెలుస్తోంది. ఈ రోజు విచారణ ముగిసిన నేపథ్యంలో, మంగళవారం మరోసారి ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.