MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ .. కోర్టు తీర్పుపై ఉత్కంఠ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విధితమే. ఈ పిటీషన్ పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేయనుంది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ .. కోర్టు తీర్పుపై ఉత్కంఠ

MLC Kavitha

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విధితమే. ఇందుకు సంబంధించిన రిట్ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. కవిత పిటిషన్‌ను జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేది‌ల ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. ఇదే సమయంలో కవిత పిటిషన్‌పై ఇప్పటికే ఈడీ కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో తమ వాదనకూడా వినాలని మార్చి 18న ఈడీ కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కవిత పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Delhi Liquor Scam : MLC కవిత 10 ఫోన్లలో ఏముంది? డిలీట్ అయిన డేటాను కూడా రికవరీ చేసే యత్నంలో ఈడీ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈ నెల 11న ఎమ్మెల్సీ కవితను తొలిసారి ఈడీ విచారించింది. 16వ తేదీన మరోసారి హాజరు కావాలని ఆదేశించి. అయితే, 16న ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదు. అంతకుముందే 14వ తేదీన కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చట్టప్రకారం మహిళలను వారి ఇంటిదగ్గరే విచారించాల్సి ఉన్నప్పటికీ ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టు‌లో పిటీషన్ దాఖలు చేసింది.

Delhi Liquor Scam : ఈడీ నా ఫోన్లు ఇవ్వమనటం మహిళ స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కలిగించటమే : MLC Kavitha

కవిత పిటీషన్‌లో పేర్కొన్న అంశాలు..

సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో కవిత అనేక అంశాలను ప్రస్తావించింది. తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కవిత కోరింది. తనపై ఎలాంటి బలవంతపు (అరెస్ట్ లాంటి) చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో సుప్రీం‌ను కవిత కోరింది. అధికార పార్టీ ఆదేశాల మేరకు ఈడీ నన్ను వేధిస్తోందని, నా విషయంలో ఈడీ చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని తెలిపింది. ఈ కేసు ఎఫ్‌ఐ‌ఆర్‌లో నా పేరు ఎక్కడ లేదని, కొద్దిమంది వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నన్ను ఈ కేసులో ఇరికించారని పేర్కొంది. అరుణ్ రామచంద్ర పిళ్లై‌ను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారని పేర్కొన్న కవిత, ఆయన తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడమే దీనికి ఒక నిదర్శనం అని పేర్కొంది. నాకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్‌మెంట్లకు విశ్వసనీయత లేదని కవితి పిటీషన్‌లో పేర్కొంది.

MLC Kavitha : కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈడీ కేవియట్ పిటిషన్

అంతేకాక, ఈడీ థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తుందని, సాక్షిని కొట్టడమే దీనికి నిదర్శనమని కవిత తన పిటీషన్ లో పేర్కొంది. ఈడీ అధికారులు నా ఫోన్‌ను బలవంతంగా తీసుకున్నారని, చట్ట విరుద్ధంగా నా ఫోన్ సీజ్ చేశారని, నా ఫోన్ సీజ్ చేసిన సమయంలో నా వివరణ తీసుకోలేదని కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో పేర్కొంది. అంతేకాక, నిబంధనలకు విరుద్దంగా సమయం దాటిన తర్వాతకూడా రాత్రి 8:30 వరకు విచారించారని, మార్చి 11న జరిగిన విచారణ సమయంలో నా ఫోను బలవంతంగా సీజ్ చేశారని పిటీషన్‌లో  కవిత పేర్కొంది. భౌతికంగా, మానసికంగా ఇబ్బందికరమైన పరిస్థితి కల్పిస్తున్నారని పేర్కొన్న కవిత, నా నివాసంలోనే విచారణ జరపాలని, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపించాలని పిటీషన్ ద్వారా సుప్రీంకోర్టును కోరింది. అయితే, ఈ పిటీషన్ పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనే అంశం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.