TRS MLC Kavitha : విమర్శల్ని మహిళా జర్నలిస్టులు ధైర్యంగా ఎదుర్కోవాలి: ఎమ్మెల్సీ కవిత

తమ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం వంద కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

TRS MLC Kavitha : విమర్శల్ని మహిళా జర్నలిస్టులు ధైర్యంగా ఎదుర్కోవాలి: ఎమ్మెల్సీ కవిత

Mla Kavitha

TRS MLC Kavitha: తమ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం వంద కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 250 మంది మహిళా జర్నలిస్టులకు ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులు విమర్శలను ఎదుర్కొని ముందుకెళ్లాలని సూచించారు. ‘‘ధర్మానికి నాలుగో పాదంగా ఉంటూ ప్రజల సంరక్షణ బాధ్యత తీసుకునేది మీడియా. మహిళలు ఎక్కడ పని చేసినా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా నలుగురికి స్ఫూర్తినిచ్చేలా ఉండాలనే ఇబ్బందులు ఎదురైనా వెనక్కితగ్గలేదు. పని ప్రదేశంలో మహిళలు డిగ్నిటీతో ఉంటూ, ఫ్యామిలీని, వర్క్ రెస్పాన్సిబిలిటీని చూసుకుంటూ పని చేయాలి. దేశవ్యాప్తంగా టాలెంట్ ఉన్న మహిళా జర్నలిస్టులు ఎందరో ఉన్నారు. అయితే కొన్ని పార్టీలు మహిళా జర్నలిస్టులను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నాయి. ఒక యాప్ ద్వారా మహిళా జర్నలిస్టులపై ఫేక్ ట్రోల్స్ చేస్తున్నారు.

TRS MPs: కేంద్రంతో తేల్చుకుంటాం..!

మహిళా జర్నలిస్టులు ఇలాంటివాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలి. రాసిన వార్తలకు రెస్పాన్సిబిలిటీ తీసుకునే ధైర్యం ఉన్నవాళ్లే నిజమైన జర్నలిస్టులు’’ అని కవిత తన ప్రసంగంలో పేర్కొన్నారు. మరోపక్క టీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు కల్పించిన సౌకర్యాల గురించి మాట్లాడారు. 18 వేల మంది జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మీడియా అకాడమీ బిల్డింగ్ నిర్మాణం కోసం 15 కోట్లు, జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం 100 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. కరోనా పాండమిక్ టైమ్‌లో జర్నలిస్టులకు 42 కోట్ల రూపాయల సహాయం చేసినట్లు వెల్లడించారు. మీడియా సెంటర్ లో మహిళలకు ప్రత్యేకంగా ఒక రూమ్ కేటాయించాలని సీఎంని కోరారు.