Huzurabad TRS : టీఆర్ఎస్ పార్టీ వైపే హుజూరాబాద్ ప్రజానీకం..ఈటెల ఏం చేశారు

హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, 2003 నుంచి ఈటల ఏం చేశారనే దానిపై చర్చించుకోవాలన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. 2021, జూన్ 07వ తేదీ సోమవారం ఆయన హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది.

Huzurabad TRS : టీఆర్ఎస్ పార్టీ వైపే హుజూరాబాద్ ప్రజానీకం..ఈటెల ఏం చేశారు

Etela Rajender

MLC Palla Rajeshwar Reddy : హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, 2003 నుంచి ఈటల ఏం చేశారనే దానిపై చర్చించుకోవాలన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. 2021, జూన్ 07వ తేదీ సోమవారం ఆయన హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా పాల్గొన్నారు. పార్టీ నిర్ణయనుసారం మీ దగ్గరికి రావడం జరిగిందని, మనమంతా ఒకే కుటుంబం అని అన్నారు. బలమైన నాయకులున్నా ఈటెల కు అధిష్టానం టికెట్ ఇచ్చిందని, సీనియర్ లీడర్ అయిన హరీష్ రావుని పక్కన పెట్టి ఈటెలను శాసన సభ ఫ్లోర్ లీడర్ ని చేశారన్నారు.

కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలను వ్యతిరేకించిన ఈటల బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు. నీకు విలువ పెంచడానికే నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ రైతు బంధు ప్రారంభించినట్లు, ఉన్న వాళ్లకు రైతు బంధు అన్నావు…3లక్షలు రైతు బంధు తీసుకుంటున్నారు ? ఎందుకు రిటర్న్ ఇవ్వలేదని ఈటలనుద్దేశించి ప్రశ్నించారు పల్లా. 2004 లో ఎంత ఆస్తి ఉండే ? ఇప్పుడు ఎంత ఉందని తాము అడిగామా ? అని నిలదీశారు.

ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు..కేసీఆర్ వ్యతిరేకిస్తే ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాడని ఎద్దేవా చేశారు. తాము అభివృద్ధి చూపిస్తాం…ఓట్లు అడుగుదాం…పక్కా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.

Read More : AP Black Fungus : ఏపీలో బ్లాక్ ఫంగస్ వల్ల 103 మరణాలు : అనిల్ సింఘాల్