Palla Rajeshwar Reddy: కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి: ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

Palla Rajeshwar Reddy: కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి: ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి

Palla

Palla Rajeshwar Reddy: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే ధాన్యం కొనుగోలుపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందని అన్నారు. ధాన్యం ఎవరు సేకరిస్తారనే విషయ పరిజ్ఞానం ఆ నేతలకు లేదని రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఒడిశా, చత్తీశ్గఢ్ రాష్ట్రాలు పార్ బొయిల్డ్ రైస్ కొనాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయని..కానీ తెలంగాణ నుంచి మాత్రం పాఱ్ బొయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతుందని రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని, ఈ విషయంపై పార్లమెంటులో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమే సమాధానం ఇచ్చిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని..రేవంత్ కే ఇబ్బంది అవుతోందంటూ ఎద్దేవా చేశారు.

Also read:Telangana : ప్రగతి భవన్‌‌కు పీకే ఎందుకు వెళ్లారు ? పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌

పీజీ వైద్య సీట్లలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని రేవంత్ లేఖ రాయడం విడ్డురంగా ఉందన్న రాజేశ్వర్ రెడ్డి, సీట్ల విషయంలో అక్రమాలకు చెక్ పెట్టేలా మేమే ఫిర్యాదు చేశామని అన్నారు. సీట్ల గోల్ మాల్ వ్యవహారంలో మంత్రులు, పల్లా ప్రమేయం ఉంటే కళాశాలను ప్రభుత్వానికి అప్పచెబుతామని, అక్రమాలకు పాల్పడినట్టు తేలితే పట్టుబడిన అభ్యర్థులకు రూ.5 లక్షల జరిమానా విధిస్తామని గతంలో జీఓ కూడా విడుదల చేసినట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి వివరించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఇష్టమైన సంస్థతో ఎప్పుడైనా దర్యాప్తు చేసుకోవచ్చని..నేను ఇచ్చిన డాక్యుమెంట్లలో ఒక్కటి తప్పున్నా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. “దమ్ముంటే మేము చెప్పిన అంశాలపై చర్చకు రా..తేల్చుకుందాం” అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

Also read:Gudivada Amarnath: వైసీపీకి ఏ పార్టీతో పొత్తులు అవసరం లేదు, చంద్రబాబు ఆశల కోసం పవన్ పనిచేస్తున్నారు: మంత్రి అమర్నాథ్