Hyderabad MMTS: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 15 నెలల తర్వాత పట్టాలెక్కనున్న హైదరాబాద్ లోకల్ ట్రైన్లు

హైదరాబాద్.. సికింద్రాబాద్ ప్రాంతాల్లో లోకల్ ట్రైన్లు ఎట్టకేలకు పట్టాలెక్కనున్నాయి. 15నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈ లోకల్ ప్రయాణం జూన్ 23న షురూ కానున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సోమవారం ప్రకటించింది.

Hyderabad MMTS: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 15 నెలల తర్వాత పట్టాలెక్కనున్న హైదరాబాద్ లోకల్ ట్రైన్లు

Hyderabad Mmts

Hyderabad MMTS: హైదరాబాద్.. సికింద్రాబాద్ ప్రాంతాల్లో లోకల్ ట్రైన్లు ఎట్టకేలకు పట్టాలెక్కనున్నాయి. 15నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈ లోకల్ ప్రయాణం జూన్ 23న షురూ కానున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సోమవారం ప్రకటించింది. (ఎంఎంటీఎస్) మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్.. ను రద్దు చేస్తున్నట్లు 2020 మార్చి 23న ప్రకటించింది రైల్వే.

మహమ్మారి తీవ్రత కారణంగా గతేడాది జాతీయ వ్యాప్త లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రద్దు చేసి ఎంఎంటీఎస్ ట్రైన్ సేవలను తిరిగి ట్విన్ సిటీస్ లో నడిపించనున్నారు అధికారులు. ముందుగా 10 లోకల్ ట్రైన్లను ఆపరేట్ చేయనుండగా.. ప్రయాణికులు తప్పనిసరిగా కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించాల్సిందేనని మాస్కులు ధరించి, వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ, సోషల్ డిస్టెన్స్ అనుసరించాలని సూచించారు.

స్టేషన్లో గానీ, రైలులోగానీ ఎవరైనా మాస్కు లేకుండా కనిపిస్తే.. వారికి రూ.500 ఫైన్ తప్పనిసరి అని రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు.

ట్విన్ సిటీస్ లో ఎంఎంటీఎస్ సేవలు 2003 నుంచే ఆరంభమయ్యాయి. 42కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ.. 121 డైలీ ట్రైన్ సర్వీసులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ ముందు వరకూ మొత్తం 25స్టేషన్ల నుంచి 1.2లక్షల మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకునేవారు.