భక్తుడిలా ఆలయానికి వచ్చి అతగాడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

దేవుడి దర్శనం కోసం వచ్చాడు. పరమ భక్తుడిలా బిల్డప్ ఇచ్చాడు.

భక్తుడిలా ఆలయానికి వచ్చి అతగాడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Mobile Phone Theft Hyderabad Temple: దేవుడి దర్శనం కోసం వచ్చాడు. పరమ భక్తుడిలా బిల్డప్ ఇచ్చాడు. ఎంతో భక్తితో భగవంతుడికి పూజ చేశాడు. గుడి చుట్టూ ప్రదక్షిణలూ చేశాడు. దైవ దర్శనం కాగానే తన అసలు రూపం బయటపెట్టాడు. భక్తుడి ముసుగులో పూజారికే శఠగోపం పెట్టాడు. ఆలయ పూజారి సెల్ ఫోన్ చోరీ చేశాడు. తన జేబులో వేసుకుని అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు.

హైదరాబాద్ శివారు బండ్లగూడ హైదర్షాకోట్ లోని విజయ గణపతి ఆలయంలో ఈ ఘటన జరిగింది. ఆలయానికి వచ్చిన ఓ వ్యక్తి.. అర్చన చేయాల్సిందిగా పూజారిని కోరాడు. పూజారి తన పనిలో తానుండగా, సెల్ ఫోన్ నొక్కేశాడు. అర్చన చేసేందుకు లోపలికి వెళ్తూ తన సెల్ ఫోన్ ని బయట పెట్టి వెళ్లాడు పూజారి. దేవుడి దర్శనం చేసుకుంటున్నట్టు నటించిన అతగడాడు, పూజారి దృష్టి మరల్చి మెల్లగా ఫోన్ కొట్టేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏమీ తెలియని అమాయకుడిలా జారుకున్నాడు.

కాసేపటి తర్వాత పూజారి తన ఫోన్ కోసం వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. దీంతో కంగారుపడ్డాడు. తక్షణమే సీసీ కెమెరా విజువల్స్ చెక్ చేశాడు. అంతే, షాక్ తిన్నాడు. అసలేం జరిగిందో క్లియర్ కట్ గా అర్థమైపోయింది. భక్తుడి ముసుగులో వచ్చిన వ్యక్తే తన సెల్ ఫోన్ చోరీ చేయడం అందులో కనిపించి విస్తుపోయాడు. వెంటనే పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.