Mocha Cyclone : ముంచుకొస్తున్న ముప్పు.. తెలంగాణకు భారీ వర్ష సూచన, రానున్న 3 రోజుల్లో కుమ్ముడే

Mocha Cyclone : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయంది.

Mocha Cyclone : ముంచుకొస్తున్న ముప్పు.. తెలంగాణకు భారీ వర్ష సూచన, రానున్న 3 రోజుల్లో కుమ్ముడే

Mocha Cyclone

Mocha Cyclone : తెలంగాణకు వాతావరణ శాఖ వాన హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయంది.

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మల్కాజ్ గిరి, నారాయణపేట, నిర్మల్, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొత్తగూడెం, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Also Read..Bandi Sanjay: అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: బండి సంజయ్

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నెల9వ తేదీకి తుపానుగా మారి ఉత్తర దిశగా మయన్మార్ వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు.

ఇదిలా ఉండగా, తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతంలోనూ ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రెండు మూడు రోజులు రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల కంటే ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది.