PM Modi: తెలంగాణ వంటకాలను రుచి చూసిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

హైదరాబాద్ హెచ్ఐసీసీలో శనివారం ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో యాదమ్మ, ఆమె బృందం అతిథులకు తెలంగాణ వంటకాలను రుచికరంగా తయారు చేసి అందించారు.

PM Modi: తెలంగాణ వంటకాలను రుచి చూసిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

Pm Modi (5)

PM Modi: హైదరాబాద్ హెచ్ఐసీసీలో శనివారం ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల బీజేపీ సీఎంలు, బీజేపీ జాతీయ స్థాయి అగ్రనేతలు పాల్గొన్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశాలకు దాదాపు 1,500 మంది హాజరయ్యారు. వీరందరికి ప్రత్యేక వంటకాలు తయారు చేయించారు.

Pm Modi (4)

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంకు సంబంధించిన వంటకాలను అతిథులకు రుచిచూపించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు కరీంనగర్‌ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను ఎంపిక చేశారు. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు యాదమ్మ, ఆమె బృందం అతిథులకు తెలంగాణ వంటకాలను రుచికరంగా తయారు చేసి అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ వంటకాలను ప్రధాని మోదీ ఇష్టంగా రుచిచూసినట్లు తెలిసింది.

Modi (1)

రెండు రోజులు సమావేశాల సందర్భంగా శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు మూడు సార్లు ప్రధాని నరేంద్ర మోదీ డైనింగ్ హాల్ ను సందర్శించారు. తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక వంటకాలను కొన్నింటిని ప్రధాని రుచి చూశారని, వంటల గురించి అడిగి తెలుసుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అ సందర్భంగా తెలంగాణ వంటలు రుచికరంగా ఉన్నాయంటూ ప్రధాని మోదీ పేర్కొన్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ప్రధానితో సహా సమావేశంకు వచ్చిన అతిథులు తెలంగాణ వంటకాలను రుచిచూసి యాదమ్మ బృందాన్ని అభినందించినట్లు పార్టీ నేతలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వంటకాలను వడ్డించినట్లు అతిథులు రాష్ట్ర పార్టీ నేతలను అభినందించారు.