Minister KTR: మోదీ జీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ఎన్జీవోనా..?

మోదీజీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా..? ఎన్జీవోనా అంటూ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. మంగళవారం బీజేపీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు ప్రధాని మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు.

Minister KTR: మోదీ జీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ఎన్జీవోనా..?

Ktr

Minister KTR: మోదీజీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా..? ఎన్జీవోనా అంటూ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. మంగళవారం బీజేపీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు ప్రధాని మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా గంటన్నర పాటు సమావేశమై పలు విషయాలపై కార్పొరేటర్లతో మోదీ చర్చించారు. కార్పొరేటర్లు ప్రజల పక్షాన పోరాడాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో సుపరిపాలన రావడానికి , కుటుంబ దుష్పరిపాలనకు చరమగీతం పాడేందుకు భాజపా పోరాటం చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రధానితో జీహెచ్‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్ల భేటీ నేపథ్యంలో ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. కార్పొరేటర్లు కమ్యూనిటీ సేవ చేయాలన్న వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక ఎన్జీవోనా అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు రావాల్సిన నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ విమర్శించారు. నిధులు మాత్రం గుజరాత్‌కు, హైదరాబాద్‌కు మాటలా మోదీ జీ అంటూ కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. హైదరాబాద్‌కు వరద సాయం, మెట్రో విస్తరణ, మూసీ పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందించేందుకు ఆలోచన చేస్తున్నారా? లేదా అంటూ ప్రశ్నించారు. ఐటీఐఆర్ పై ఏమైనా పురోగతి ఉందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌ గతంలో ఎన్నడూలేని రీతిలో భారీ వరదలను ఎదుర్కొందని, కానీ ప్రధాని మోదీ ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదని మంత్రి ప్రశ్నించారు. 2018 నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ఎఫ్ నిధులు తెలంగాణకు ఇవ్వలేదని, దానికి సంబంధించిన వివరాలను మంత్రి ట్వీట్ చేశారు.