PM Modi: బేగంపేట విమానాశ్రయం వద్ద నేడు మోదీ పబ్లిక్ మీటింగ్.. ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి..

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 6.40 గంటల వరకు మోదీ పర్యటన కొనసాగుతోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు విమానాశ్రయం వద్ద తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభలో మోదీ ప్రసంగంపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది.

PM Modi: బేగంపేట విమానాశ్రయం వద్ద నేడు మోదీ పబ్లిక్ మీటింగ్.. ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి..

PM Mod

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 6.40 గంటల వరకు మోదీ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా రెండు సభల్లో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు విమానాశ్రయం వద్ద తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు రామగుండంలో ఎన్టీపీసీ టౌన్ షిప్ లో ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించనున్నారు. అయితే, ఎయిర్ పోర్టు వద్ద తెలంగాణ బీజేపీ ఏర్పాటు  చేసిన సభ కావటంతో ప్రధాని మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

PM Modi AP Tour: విశాఖలో ప్రధాని మోదీ పర్యటన.. నేడు ఏయూలో బహిరంగ సభ.. వేదికపై మోదీ, జగన్‌సహా నలుగురే ..

మునుగోడు ఉపఎన్నికల నేఫథ్యంలో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఫలితాలు వెల్లడైనప్పటికీ బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటన ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి మరింత ఆజ్యంపోసింది. మధ్యాహ్నం 12.25 గంటలకు విశాఖ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ప్రధాని మోదీ 1.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం అక్కడ తెలంగాణ బీజేపీ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మోదీ ప్రసంగిస్తారు. ఈ పబ్లిక్ మీటింగ్ కు జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తారని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నారు. అయితే, ఈ సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ఐఎస్బీ వార్షికోత్సవాలకు హాజరైన సందర్భంలో కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రధాని విమర్శలు చేసిన విషయం విధితమే. తాజాగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేడు జరిగే సభలో సీఎం కేసీఆర్, తెరాస పాలనపై మోదీ మాట్లాడతారని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో మోదీ ప్రసంగం ఎలా సాగుతుందనేది అందరిలో ఆసక్తి నెలకొంది.

PM Modi Telangana Tour: నేడు తెలంగాణకు ప్రధాని మోదీ.. ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం.. రెండు చోట్ల సభల్లో ప్రసంగం

ప్రధాని టూర్ షెడ్యూల్ ఇలా..

– ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 12.25కు విశాఖ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
– మధ్యాహ్నం 1.30 నిమిషాలకు బేగంపేట ఏయిర్ పోర్టుకు ప్రధాని చేరుకుంటారు.
– మధ్యాహ్నం 2.05 గంటలకు విమానాశ్రయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
– మధ్యాహ్నం 2.15 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బేగంపేట రామగుండం బయలు దేరి వెళ్తారు.
– మధ్యాహ్నం 3.20నిమిషాలకు రామగుండం హెలీప్యాడ్ కు చేరుకుంటారు.
– 3.30 నిమిషాలకు రోడ్డు మార్గం ద్వారా ఎరువుల ఫ్యాక్టరీకి చేరుకుంటారు.
– 3.30 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఫ్యాక్టరీని మోదీ పరిశీలిస్తారు.
– సాయంత్రం 4.15 నిమిషాలకు కార్యక్రమం జరిగే ప్రాంతానికి మోదీ చేరుకుంటారు.
– సాయంత్రం 4.15నుండి 5.15నిమిషాల వరకు జాతికి అంకితం ఇచ్చే పలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు.
– సాయంత్రం 5.30నిమిషాలకు రామగుండం నుండి బేగంపేట బయలు దేరుతారు.
– సాయంత్రం 6.30నిమిషాలకు బేగంపేట ఏయిర్ పోర్టుకు చేరుకొని, 6.40 నిమిషాలకు బేగంపేట ఏయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరుతారు.