KA Paul: ప్రధానిగా మోదీ ఉండకూడదు.. వారిద్దరిలో ఎవరైనా ఓకే..

బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తోందని, ప్రధానిగా మోదీ ఉండకూడదని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. దేశం అప్పులతో వెనుజుల, శ్రీలంకగా మారుతుందని, దేశం, తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో ఉన్నాయని అన్నారు.

KA Paul: ప్రధానిగా మోదీ ఉండకూడదు.. వారిద్దరిలో ఎవరైనా ఓకే..

Ka Paul

KA Paul: బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తోందని, ప్రధానిగా మోదీ ఉండకూడదని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. దేశం అప్పులతో వెనుజుల, శ్రీలంకగా మారుతుందని, దేశం, తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో ఉన్నాయని అన్నారు. నాకున్న అనుభవంలో మోదీ ఎంత అంటూ వ్యాఖ్యానించారు. నేను దేశాన్ని రక్షించగలనని, ఆర్థికంగా అభివృద్ధి చేయగలనని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తోందని, అయితే ప్రధానిగా మోదీ కాకుండా రూపాల, అమిత్ షా అయితే బాగుంటుందని పాల్ పేర్కొన్నారు.

KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్

ప్రస్తుతం ప్రధాని మోదీ పాలనలో దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, నిజాయితీ, మార్పు కావాలంటే కేఏ పాల్ ను ఎంచుకోండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలారా ఆత్మను అమ్ముకోకండి, కేవలం ప్రజశాంతి పార్టీ మాత్రమే నిజాయితీ పార్టీ, బీజేపీ నుండి దేశాన్ని కాపాడటానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అని రూపాల తనతో అన్నారంటూ కేఏ పాల్ పేర్కొన్నారు. రూపాల.. అన్ని బయట చెప్పరు కదా.. అంటూనే బుద్ధి ఉన్నవారు, తెలివైన వారందరు నాతో వస్తున్నారని పాల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒక్క సిట్ కూడా గెలవదని అన్నారు.

Philippines President: 36ఏళ్ల క్రితం దేశం నుంచి తన కుటుంబాన్ని వెళ్లగొట్టారు.. ఇప్పుడు అదే దేశానికి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు..

కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ స్వార్థ పరుడు అంటూ విమర్శించారు. దేశంలో అన్ని వ్యవస్థలు నాశనం అవుతున్నాయని, ప్రజలంతా ఏకంగా కావాలి, సమస్యలపై ఎమ్మెల్యే లను నిలదీయండి.. ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ పాల్ పిలుపునిచ్చారు. తెలంగాణ లో ఒక్క కుటుంబం పై 10లక్షల అప్పు ఉందన్న పాల్.. నాపై దాడులు జరిగినా భయపడను అన్నారు.