KTR Tweet On Modi: మోదీజీ.. మీరు నిజంగా మహిళలకు గౌరవం ఇవ్వాలని కోరుకున్నట్లయితే ఆ పని చేయండి.

ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వీలు చిక్కినప్పుడల్లా విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ట్విటర్ వేదికగా ప్రధానిని ప్రశ్నిస్తున్నారు.

KTR Tweet On Modi: మోదీజీ.. మీరు నిజంగా మహిళలకు గౌరవం ఇవ్వాలని కోరుకున్నట్లయితే ఆ పని చేయండి.

PM MODI

KTR Tweet On Modi: ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వీలు చిక్కినప్పుడల్లా విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ట్విటర్ వేదికగా ప్రధానిని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ట్విటర్ వేదికగా కేటీఆర్ మోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మీకు నిజంగా మహిళలంటే గౌరవం ఉన్నట్లయితే వెంటనే ఆ పని చేయండి అంటూ కేటీఆర్ ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

KTR Criticized PM Modi Speech : ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంపై మంత్రి కేటీఆర్ విమర్శలు

గుజరాత్ లో 2002లో బిల్కిస్ బానో గ్యాంగ్ రేపు కేసులో 11 మంది దోషులుగా జైలు జీవితం గడుపుతున్నారు. రెమిషన్ విధానం కింద ఖైదీలను విడుదల చేస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో ప్రభుత్వం తీరుపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా మంత్రి కేటీఆర్ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు.

PM Modi: స్వాతంత్ర్య వేడుకల్లో ఆసక్తికర దృశ్యం.. చిన్నారుల మధ్య ఉత్సాహంగా గడిపిన మోదీ

మహిళలను గౌరవించాలంటూ మీరు చెప్పే మాటలపై చిత్తశుద్ధి ఉంటే గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ ఆర్డర్ పై జోక్యం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీని కోరారు. ఆ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయించాలని, తద్వారా దేశం పట్ల మీకున్న చిత్తశుద్దిని నిరూపించుకోవాలని అన్నారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో తగిన సవరణలు చేసి రేపిస్టులకు బెయిల్ రాకుండా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.