PM Modi: రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక.. స్వాగతం పలకనున్న..

ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ రానున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవం.. మొహాలీ క్యాంపస్ లకు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గోనున్నారు. ప్రధాని మోదీకి సాదర స్వాగతంతో పాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పదాధికారులు, ముఖ్యనేతలు, హైదరాబాద్...

PM Modi: రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక.. స్వాగతం పలకనున్న..

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ రానున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవం మొహాలీ క్యాంపస్ లకు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గోనున్నారు. ప్రధాని మోదీకి సాదర స్వాగతంతో పాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పదాధికారులు, ముఖ్యనేతలు, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నాయకుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించేలా రాష్ట్ర బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏ కొంత సమయం చిక్కినా ఎయిర్ పోర్టు లాంజ్ లో మోదీతో రాష్ట్ర పార్టీ ముఖ్యులు సమావేశమయ్యే అవకాశముంది. బేగంపేటలో ప్రధానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు స్వాగతం పలకనున్నారు.

PM Modi in Japan: ప్రపంచానికి దిక్సూచిగా భారత్: క్వాడ్ లీడర్ల ముందు వరుసలో ప్రధాని మోదీ

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఐఎస్‌బీతో పాటు బేగంపేట విమానాశ్రయం, హెచ్‌సీయూలలో భారీ ఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు. ఒక్క ఐఎస్‌బీలోనే 2వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. సైబరాబాద్ ఇన్‌ఛార్జి కమిషనర్ సీవీ ఆనంద్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం నుంచే ఈ ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని పర్యటనలో ఎక్కడా అపశ్రుతులు దొర్లకుండా విద్యార్థుల సామాజిక మాధ్యమాలను తనిఖీ చేసి, ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక భావాలు కలిగి ఉన్నట్లు గుర్తిస్తే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ప్రధాని చేతుల మీదుగా పట్టాలు అందుకునే పది మంది విద్యార్థుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐఎస్‌బీ సిబ్బంది పూర్వాపరాలు కూడా ఒకటికి రెండుసార్లు పరిశీలించి నిర్ధారించుకుంటున్నారు. ఇదిలాఉంటే ప్రధానికి విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ సోమేశ్ కుమార్ స్వాగతం పలకనున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన దృష్ట్యా ప్రధాని కార్యక్రమానికి హాజరు కావడం లేదని తెలుస్తోంది. సీఎస్ అక్కడికి వెళ్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు మోదీకి ఎయిర్ పోర్టులో పార్టీ పరంగా ఘన స్వాగతం పలికేందుకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది.

PM Modi: పెట్రో ధరల తగ్గింపుపై మోదీ ట్వీట్

ప్రధాని పర్యటన ఇలా..
– ప్రధాని నరేంద్ర మోదీ 26వ తేదీ(గురువారం) మధ్యాహ్నం 1.25 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు.
– అక్కడే 15 నిమిషాలు బీజేపీ ముఖ్యనేతలను కలుసుకుంటారు. పార్కింగ్ లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి పార్టీకార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తారు.
– అక్కడ నుండి హెలికాప్టర్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌యూసీ)కి వెళ్తారు. హెలిప్యాడ్‌లో దిగి రోడ్డు మార్గాన 2కి.మీ. ఐఎస్‌బీకి ప్రయాణిస్తారు.
– మధ్యాహ్నం 2నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బీ వార్షికోత్సవం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు.
– సాయంత్రం 4గంటలకు తిరిగి బేగంపేటకు చేరుకొని ప్రత్యేక విమానంలో చెన్నై వెళతారు.