Moinabad Farmhouse case: ‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం’ కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ కేంద్రంగా చోటుచేసుకున్న ‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం’ వ్యవహారంలో జైలులో ఉన్న ఇద్దరు నిందితులకు ఇవాళ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. ఏ1 రామచంద్ర భారతితో పాటు ఏ2 నంద కుమార్‌ రూ.6 లక్షల చొప్పున నాంపల్లి కోర్టులో పూచీకత్తు సమర్పించారు.

Moinabad Farmhouse case: ‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం’ కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్

Moinabad Farmhouse case

Moinabad Farmhouse case: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ కేంద్రంగా చోటుచేసుకున్న ‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం’ వ్యవహారంలో జైలులో ఉన్న ఇద్దరు నిందితులకు ఇవాళ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. ఏ1 రామచంద్ర భారతితో పాటు ఏ2 నంద కుమార్‌ రూ.6 లక్షల చొప్పున నాంపల్లి కోర్టులో పూచీకత్తు సమర్పించారు.

దీంతో వారికి కోర్టు బెయిల్‌ ఇచ్చింది. వారిద్దరు రేపు చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అవుతారు. మరోవైపు, ఎమ్మెల్యేలకు ఎర కేసులోని మరొక నిందితుడు సింహయాజీకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో చంచల్‌గూడ జైలు నుంచి ఆయన ఇవాళ విడుదల అయ్యారు.

కాగా, మొయినాబాద్ లోని పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి చెందిన ఫాంహౌస్‌ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కొనేందుకు యత్నించిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. నిందితుల నుంచి పోలీసులు ఇప్పటికే పలు వివరాలు రాబట్టారు. కాగా, ‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం’ వ్యవహారంలో టీఆర్ఎస్-బీజేపీకి మధ్య ఇప్పటికీ మాటల యుద్ధం కొనసాగుతుంది. ఢిల్లీ నుంచి వచ్చిన దొంగలను పట్టుకుని జైల్లో వేశామని సీఎం కేసీఆర్ తాజాగా విమర్శలు గుప్పించారు.

Forbes List: వరుసగా నాలుగోసారీ శక్తివంతమైన మహిళగా నిలిచిన నిర్మలా సీతారామన్