షాకింగ్ వీడియో : నమ్మించి, నవ్వించి.. గొంతు కొరికేసింది

మూగ జీవాలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఘటన ఇది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణం మీదకు తెచ్చుకున్నట్టే. మూగ జీవే కదా.. పాపం అనే ముందు కాస్త ఆలోచన

10TV Telugu News

మూగ జీవాలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఘటన ఇది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణం మీదకు తెచ్చుకున్నట్టే. మూగ జీవే కదా.. పాపం అనే ముందు కాస్త ఆలోచన

మూగ జీవాలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఘటన ఇది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణం మీదకు తెచ్చుకున్నట్టే. మూగ జీవే కదా.. పాపం అనే ముందు కాస్త ఆలోచన చేయాల్సిందే. లేదంటే.. మీ ప్రాణం డేంజర్ లో పడినట్టే. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట పట్టణంలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఓ కొండముచ్చు యువకుడిని తీవ్రంగా గాయపరిచింది. వివరాల్లోకి వెళితే.. జనాల మధ్యకు వచ్చిన కొండ ముచ్చు.. అటు ఇటు తిరిగింది. ఆ తర్వాత రోడ్డెక్కింది. 

అదే సమయంలో ఓ వ్యక్తి తన బైక్ ఎక్కి కూర్చున్నాడు. బండి స్టార్ట్ చేయబోయాడు. ఇంతలో కొండముచ్చు వచ్చి ఆ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ మీద అతనికి ఎదురుగా కూర్చుంది. అతను కాస్త కంగారు పడుతూనే ఉన్నాడు. అది మామూలుగా అటూ ఇటూ చూసింది. తనను ఏమీ అనదని అతడు అనుకున్నాడు. ఆ కొండముచ్చు కూడా అలాగే నమ్మించింది. అతని ముఖంలోకి ముఖం పెట్టి చూసింది. చేతులతో అతని భుజాల మీద చేయి వేసింది. కొండముచ్చు తనను ఏమీ అనదనే నమ్మకంతోనే ఆ వ్యక్తి ఉన్నాడు.

ఇంతలో దానికి ఏం తిక్క రేగిందో తెలియదు కానీ.. ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. యువకుడు దాని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగానే అది అతని గొంతు కొరికి పారిపోయింది. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిది రాయపర్తి గ్రామం. 

కాగా, 20 రోజులుగా కొండముచ్చు ఇలా దాడులకు పాల్పడుతోందని సూర్యాపేట వాసులు వాపోయారు. దాని కారణంగా భయాందోళన చెందుతున్నామన్నారు. వెంటనే ఆ కొండముచ్చుని బంధించి జనాలకు దూరంగా వదిలేయాలని అధికారులను డిమాండ్ చేశారు.

కొండముచ్చు బైక్ ఎక్కడం, ఆ యువకుడితో ఆడుకోవడం, ఆ తర్వాత దాడి చేయడం.. దీన్నంతా ఎవరో షూట్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఊహించని విధంగా కొండముచ్చు అలా దాడి చేసి గొంతు కొరికే సరికి.. అంతా షాక్ అయ్యారు. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. మూగజీవాలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం అంటున్నారు. కోతులు, కుక్కలు, పిల్లులతో కొందరు ఆడుకుంటూ ఉంటారు. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని తెలుసుకోవాలి.