Drunken Monkey : కల్లు తాగిన కోతి-ఆదాయం పోతోందని గీత కార్మికుడి ఆవేదన

మహబూబాబాద్ జిల్లాలో గీత కార్మికుడు విచిత్ర పరిస్ధితిని ఎదుర్కోంటున్నాడు. కల్లుతాగుతున్న కోతి కార్మికుడి ఆదాయానికి గండి కొడుతోంది.

Drunken Monkey : కల్లు తాగిన కోతి-ఆదాయం పోతోందని గీత కార్మికుడి ఆవేదన

Drunken Monkey

Drunken Monkey :  మహబూబాబాద్ జిల్లాలో గీత కార్మికుడు విచిత్ర పరిస్ధితిని ఎదుర్కోంటున్నాడు. కల్లు తాగుతున్న కోతి కార్మికుడి ఆదాయానికి గండి కొడుతోంది. మహబూబాబాద్ మండలంలోని వేంనూరు గ్రామంలో ఓ తాగుబోతు కోతి….తమకు జీవనాధార మైన తాటి కల్లును తాగుతూ ఉపాధి లేకుండా చేస్తోందని ఆవేదన చెందుతున్నాడు. ఎంత బెదిరించినా ఫలితం లేకుండా పోతుందని… ఏం చేయాలో అర్ధం కావడం లేదని గౌడ్ గుట్టయ్య అన్నాడు.

వేంనూరు గ్రామంలో నలమాస గుట్టయ్య గౌడ్ వృత్తి రీత్యా కల్లు గీత కార్మికుడు. తన కున్న తాటి చెట్లను ఎక్కుతూ కల్లు అమ్ముకుంటూ వచ్చిన రూ. 200…300 వందలతో జీవనం కొనసాగించేవారు. గత కొన్ని రోజులుగా గుట్టయ్య‌కు ఓ కోతి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కల్లుకు రుచి మరిగిన కోతి ఉదయం… సాయంత్రం అదే పనిగా చెట్టు ఎక్కి కల్లు తాగుతు అక్కడక్కడే చెట్ల మీద తిరుగుతూ కాలక్షేపం చేస్తోందిట. రోజు కల్లు కుండలు నిండే సమయానికి ఆ చెట్లు ఎక్కి కల్లు తాగుతూ ఎంజాయ్ చేస్తోందట.
Also Read : Telangana Sona Benefits : తెలంగాణ సోనా.. డయాబెటిస్ బాధితులకు దివ్యౌషధం..!
కోతి ఎంజాయ్ పక్కన పెడితే పాపం గౌడన్న ఉపాధి కోల్పోయే పరిస్థితి ఎదురైంది. చెట్టుపై కోతి కల్లు తాగుతున్న విషయం ఊరంతా పాకడంతో పాపం గుట్టయ్యకు ఏం చేయాలో తోచడం లేదు. ఈ తాగుబోతు కోతి వల్ల నా జీవితం ఆగమై పోతోందనే ఆవేదనలో గుట్టయ్య తీవ్ర మనస్థాపానికి గురవుతున్నాడు. ఏదైనా అపాయానికి ఉపాయం దొరకకపోదా అని ఎదురుచూస్తున్నాడు గుట్టయ్య…