Monkeypox: అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం.. నేటి నుంచి గాంధీ ఆస్ప‌త్రిలో మంకీపాక్స్ టెస్ట్‌లు

దేశంలో తొలి మంకీపాక్స్ కేసు న‌మోదు కావ‌టంతో తెలంగాణ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రిలో మంకీపాక్స్ టెస్టులు చేసేందుకు సిద్ధ‌మైంది. రాష్ట్రంలో మంకీపాక్స్ మ‌హ‌మ్మారి వ్యాప్తి చెంద‌కుండా వైద్య శాఖ ఆధ్వ‌ర్యంలో చ‌ర్య‌లు చేప‌ట్టింది.

Monkeypox: అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం.. నేటి నుంచి గాంధీ ఆస్ప‌త్రిలో మంకీపాక్స్ టెస్ట్‌లు

Monkeypox

Monkeypox: ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్ప‌టికే 50దేశాల్లో మంకీపాక్స్ వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా మ‌ర‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల హెచ్చరించింది. తాజాగా.. భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు న‌మోదైంది. యూఎస్ఈ నుంచి ఇటీవ‌ల కేర‌ళ‌కు వ‌చ్చిన వ్య‌క్తికి మంకీపాక్స్ సోకినట్టు నిర్ధారణ అయింది. దేశంలో మంకీపాక్స్ తొలికేసు న‌మోదు కావ‌డంతో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది.

Monkeypox: దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..

దేశంలో తొలి మంకీపాక్స్ వైర‌స్ కేసు న‌మోదైన నేప‌థ్యంలో రాష్ట్ర‌, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను కేంద్రం అప్ర‌మ‌త్తం చేసింది. కేంద్ర ఆరోగ్య‌శాఖ నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులు జ్వరం, జలుబు ఉన్న వాళ్లతో సన్నిహితంగా ఉండరాదని సూచించింది. ఎలుకలు, వన్యప్రాణులు, ఉడుతలు ఇతర జీవులకు దూరంగా ఉండాలని పేర్కొంది. మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించిన, కేసు న‌మోదైన వ్య‌క్తుల‌తో స‌న్నిహితంగా మెలిగిన‌వారు వెంట‌నే స‌మీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని స్ప‌ష్టంచేసింది.

Monkeypox: కేరళలో మంకీపాక్స్ కలకలం.. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిలో రోగ లక్షణాలు

దేశంలో తొలి మంకీపాక్స్ కేసు న‌మోదు కావ‌టంతో తెలంగాణ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రిలో మంకీపాక్స్ టెస్టులు చేసేందుకు సిద్ధ‌మైంది. రాష్ట్రంలో మంకీపాక్స్ మ‌హ‌మ్మారి వ్యాప్తి చెంద‌కుండా వైద్య శాఖ ఆధ్వ‌ర్యంలో చ‌ర్య‌లు చేప‌ట్టింది. భారీ సంఖ్య‌లో ప‌రీక్ష‌ల నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే పూణె వైరాల‌జీ ల్యాబ్ నుంచి టెస్టింగ్ కిట్ల‌ను తెప్పించేందుకు సిద్ధ‌మైన ప్ర‌భుత్వం.. కిట్లు అందుబాటులోకి రాగానే ట్ర‌య‌ల్ ర‌న్స్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. క‌రోనా ఆర్టీపీసీఆర్‌ టెస్టుల మాదిరిగానే మంకీపాక్స్‌ టెస్టులు చేయనున్నారు. బ్లడ్‌, స్వాబ్‌, స్కిన్‌పై ఉన్న నీటిబుడగల నుంచి శాంపిల్స్‌ సేకరించనున్నారు.