Motkupalli Narasimhulu : దళితబంధు చైర్మన్‌గా మోత్కుపల్లి నర్సింహులు..?

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మోత్కుపల్లి నర్సింహులుకు కీలక పదవి అప్పగించనున్నారు. దళితబంధు చైర్మన్ గా మోత్కుపల్లిని నియమించనున్నారు కేసీఆర్. దళితబంధు చైర్మన్ గా

Motkupalli Narasimhulu : దళితబంధు చైర్మన్‌గా మోత్కుపల్లి నర్సింహులు..?

Motkupalli Narasimhulu

Motkupalli Narasimhulu : తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మోత్కుపల్లి నర్సింహులుకు కీలక పదవి అప్పగించనున్నారు. దళితబంధు చైర్మన్ గా మోత్కుపల్లిని నియమించనున్నారు కేసీఆర్. దళితబంధు చైర్మన్ గా మోత్కుపల్లి పేరు దాదాపుగా ఖరారైంది.

Internet: ఇంటర్నెట్ ‘స్లో’గా ఉందా? చిటికెలో వైఫై స్పీడ్ పెంచుకోండి!

మరో మూడు నాలుగు రోజుల్లో మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరనున్నారు. టీఆర్ఎస్ లో చేరిక తర్వాత మోత్కుపల్లి పేరుని కేసీఆర్ ప్రకటించనున్నారు. పదవి గురించి మోత్కుపల్లికి కేసీఆర్ నుండి స్పష్టమైన హామీ వచ్చినట్టు సమాచారం. ఇవాళ ఉదయం కేసీఆర్ మోత్కుపల్లిని అసెంబ్లీకి స్వయంగా వెంటబెట్టుకొచ్చారు. ఉదయం నుండి మోత్కుపల్లి సీఎం కేసీఆర్ తోనే ఉన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణలోని రాజకీయ నేతల్లో సీనియర్‌. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో కొనసాగి ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. బీజేపీలో చేరిన ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకంపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ పథకం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌ను అభినవ అంబేద్కర్‌గా కీర్తించారు. పార్టీలకు అతీతంగా నేతలందరూ ఈ పథకం విషయంలో సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. మోత్కుపల్లి చేసిన ఈ కామెంట్స్.. ఆయన త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరతారని చెప్పకనే చెప్పాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Facebook Outage : ఆమె లైవ్‌లో కనిపించింది అంతే.. క్షణాల్లో ఫేస్‌బుక్ సర్వీసులన్నీ బంద్..!

రాష్ట్రంలో ప్రస్తుతం దళిత నినాదం తెరపైకి రావడంతో, మోత్కుపల్లికి కీలక పదవి దక్కే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించాయి. అదే సమయంలో మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరితే, సీఎం కేసీఆర్ ఆయనకు కీలక పదవి ఇస్తారని వార్తలొచ్చాయి. దళితబంధు పథకానికి చట్టబద్ధత తీసుకొచ్చి.. ఆ పథకం అమలు కోసం మోత్కుపల్లిని చైర్మన్‌గా నియమించాలని కేసీఆర్ అనుకుంటున్నట్టు తెలిసింది. ఈ పదవికి కేబినెట్ ర్యాంక్ కూడా ఇస్తారనే టాక్ వినిపిస్తోంది.

ఈ వార్తలకు ఊతమిచ్చే విధంగా మోత్కుపల్లి నర్సింహులు సీఎం కేసీఆర్ నిర్వహించిన దళితబంధు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. సమీక్షకు హాజరుకావడమే కాదు.. స్వయంగా ఈ భేటీలో సీఎం కేసీఆర్ పక్కన సీటులోనే కూర్చుకున్నారు మోత్కుపల్లి. దీంతో ఆయనకు కీలకమైన పదవి దాదాపుగా ఖాయమైందనే ఊహాగానాలు వినిపించాయి. ఈ పదవికి సీఎం కేసీఆర్ మోత్కుపల్లి నర్సింహులును ఎంచుకోవడం వెనుక సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగానే వ్యవహరించాలనే టాక్ వినిపిస్తోంది. ఎస్సీ వర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు మంచి వాగ్దాటి కలిగిన నాయకుడు. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించడంలో మోత్కుపల్లి దూకుడుగా ఉంటారు.

గతంలో టీడీపీలో ఉన్న సమయంలో సీఎం కేసీఆర్‌ను మోత్కుపల్లి అనేక సందర్భాల్లో గట్టిగా విమర్శించారు. మిగతా నాయకులకు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చిన టీఆర్ఎస్.. అప్పట్లో మోత్కుపల్లి నర్సింహులును ఎదుర్కోవడంలో మాత్రం ఇబ్బందిపడిందనే వాదన ఉంది. అలాంటి మోత్కుపల్లికి దళితబంధు అమలుకు సంబంధించిన కీలక పదవి ఇవ్వడం ద్వారా.. ఆయన ఈ అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళతారని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట.