గణేష్ నిమజ్జనం రోజునే మొహరం

గణేష్ నిమజ్జనం రోజునే మొహరం

సెప్టెంబర్ 12న జరిగే గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల కోసం సిటీలో భారి భద్రత ఎర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆ రోజు గణేష్ నిమర్జనం ఒక్కటే కాదు.. మొహర్రం కూడా ఉంది. రెండు ఒకే రోజు రావడంతో పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు మసీదులపై కూడా ప్రత్యేక నిఘూ ఉంచనున్నారు పోలీసులు. 

బాలాపూర్ వినాయకుడికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత బాలపూర్ నుంచి కొనసాగే వినాయకుడి శోభయాత్ర మార్గాలను అంజనీ కుమార్ పరిశీలించారు. రూట్ మొత్తం సీసీ కెమెరా నిఘాలో ఉంటుందన్నారు సీపీ. గణేష్ నిమజ్జనానికి 20వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 

భారీగా ప్రజలు తరలివచ్చే కార్యక్రమంలో అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. బుధవారం నుంచి ప్రారంభమైన నిమజ్జనాలు సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతాయని తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రతి గణేష్ మండపానికి ఒక పోలీసులను కేటాయించారు. నిమజ్జనం కోసం 32 క్రేన్స్ ఏర్పాటు చేశామన్నారు GHMC కమిషనర్ లోకేష్ కుమార్.