Covid Sanitize Multi Cabinet : నిమిషాల్లోనే కరోనాను చంపేసే పరికరం.. శానిటైజ్ చేసేస్తుంది..!

దేశంలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. కరోనావైరస్ బారిన పడకుండా ఉండేందుకు మాస్క్, సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బయట కొన్న వస్తువులను ముట్టుకోవాలంటే భయపడే పరిస్థితి.

Covid Sanitize Multi Cabinet : నిమిషాల్లోనే కరోనాను చంపేసే పరికరం.. శానిటైజ్ చేసేస్తుంది..!

Multi Cabinet Device For Sanitization Of Outside Goods

Covid Sanitize Multi Cabinet : దేశంలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. కరోనావైరస్ బారిన పడకుండా ఉండేందుకు మాస్క్, సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బయట కొన్న వస్తువులను ముట్టుకోవాలంటే భయపడే పరిస్థితి. ఎలాంటి వస్తువులనైనా శానిటైజేషన్ చేయడం తప్పనిసరిగా మారింది. అందుకే ఏ వస్తువులనైనా సులభంగా శానిటైజ్ చేసే మల్టీ క్యాబినెట్ పరికరం అందుబాటులోకి వచ్చింది..

ఇది నిమిషాల వ్యవధిలోనే కరోనావైరస్ ను అంతం చేసేస్తుంది. బయట నుంచి తెచ్చిన ఏ వస్తువునైనా సులభంగా నిమిషాల్లోనే శానిటైజ్ చేసేస్తుంది. కరోనా సమయంలో ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ‘శుద్ధీకరణ్‌’ పేరుతో మూడు మల్టీ డిజైన్లను రూపొందించారు. ప్రత్యేకించి తమ క్యాంపస్ లో వాడేందుకు తయారుచేశారు. మల్టీ క్యాబినెట్‌ పరికరాన్ని కొద్దిరోజుల క్రితమే క్యాంపస్ ఎంట్రీ వద్ద ఏర్పాటు చేశారు.

బయటి నుంచి లోపలికి వచ్చే వ్యక్తులు తెచ్చే వస్తువులను వైరస్‌ రహితంగా మార్చేస్తుంది. ప్యాకింగ్‌ చేసిన తినే ఆహార పదార్థాలను కూడా శానిటైజ్ చేసుకోవచ్చు. శుద్ధీకరణ్‌ యూటీని క్యాంపస్‌ ప్రాంగణంలో ఉంచారు.

వస్తువులను లోపల ఉంచితే మూడు నిమిషాల్లో వైరస్‌ రహితంగా మారుతాయి. గంటలో 1,200 గిన్నెలను శుద్ధి చేయొచ్చునని అంటున్నారు. తయారీలో కీలకంగా ఉన్న పరిశోధక విద్యార్థి ప్రియబ్రత రౌత్రే వివరించారు. అల్ట్రావయొలెట్‌(UV) కాంతితో వస్తువులు, గిన్నెలను క్రిమిరహితంగా మార్చవచ్చు.