MLA Seethakka: ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

ములుగు జిల్లాలోని ఎటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన దండోరా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు.

MLA Seethakka: ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Seethakka

MLA Seethakka: ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లాలోని ఎటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన దండోరా యాత్రలో పాల్గొన్న ఆమె.. తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోకు వినతిపత్రం అందించే క్రమంలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సీతక్కను కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు.

దళిత గిరిజన దండోర యాత్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక మార్కెట్‌ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు నాలుగు కిలోమీటర్ల మేర సీతక్క పాదయాత్ర చేశారు. తర్వాత తహసీల్దారుకు వినతి పత్రం సమర్పించి బయట వచ్చాన వెంటనే సీతక్క సొమ్మసిల్లి పడిపోయారు. శరీరమంతా చెమటలు పట్టడంతో అక్కడే ఉన్న కార్యకర్తలు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందించగా.. ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వెల్లడించారు డాక్టర్లు. బీపీ పడిపోవటంతో కళ్లు తిరిగినట్లు డాక్టర్లు చెప్పారు. ఇదే సమయంలో ఆస్పత్రిలో సూపరింటెండెంట్ లేకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.