Munugode By Poll : మునుగోడు యువతకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నా : కేఏ పాల్

మునుగోడు ఉప ఎన్నిక తప్పనిసరి అయిన క్రమంలో ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు యువతకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నానంటూ ప్రకటించారు.

Munugode By Poll :  మునుగోడు యువతకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నా : కేఏ పాల్

Munugode By Poll..ka paul

Munugode By Poll..ka paul : కేఏ పాల్. పరిచయం అవసరం లేని వ్యక్తి. ప్రజాశాంతి పార్టీ చీఫ్. మత ప్రభోధకుడు. ఒకప్పుడు ప్రపంచ దేశాధినేతలతో సమావేశాలు నిర్వహించిన పాల్ కు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆదరణ కనిపించదు. ఆయన చేసే కొన్ని పనులు..చేసే వ్యాఖ్యల..ప్రసంగాలు ఎప్పుడూ సోషల్​ మీడియాలో ట్రెండింగ్​గా ఉంటాయి. అలాంటి కేఏపాల్ తాజాగా చేసిన ప్రకటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్​ టాపిక్​గా మారిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో ఆసక్తికరంగా మారింది. రాజకీయాలలో నవ్వుల పువ్వులు పూయించే కేఏ పాల్ ఏం చేసినా ఒక సంచలనమే. ఏం మాట్లాడినా సంచలనమే. అటువంటి కేఏ పాల్ తాజాగా మునుగోడు ఉప ఎన్నికల సందర్భాన్ని కూడా కేఏ పాల్ వద్దల్లేదు. మునుగోడులో తన పార్టీ పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు.మునుగోడు నుంచి టీఆర్ఎస్ పార్టీపై యుద్ధం మొదలుపెడతానంటున్నారు కేఏ పాల్.

మునుగోడు ఉప ఎన్నికలు తెలంగాణలో కాక పుట్టిస్తుంటే సందట్లో సడేమియాలా కేఏ పాల్ తనదైనశైలిలో హల్ చల్ చేస్తున్నారు. మునుగోడు యువతకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నానంటూ ప్రకటించారు కేఏపాల్. రేపు అంటే సెప్టెంబర్ 25న మునుగోడులో ప్రత్యేక మీటింగ్ నిర్వహించబోతున్నానంటూ ప్రకటించారు. మునుగోడు యువతకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నానని అక్టోబర్ 2న శాంతి సభ ఏర్పాటుచేస్తున్నాం అంటూ ప్రకటించారు. మునుగోడు నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభించబోతున్నానని ఒక శాతం ఉన్న వర్గంవారే రాష్ట్రాన్ని పాలించాలా? నేను మునుగోడు మా పార్టీ పోటీ చేస్తుందని గెలిచి తీరుతాం అని ధీమా వ్యక్తం చేశారు కేఏపాల్ తనదైన శైలిలో. మునుగోడులో గెలిచి తెలంగాణ ప్రజలకు చక్కటి పాలన అందజేస్తానని తెలంగాణ అభివృద్ది ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమవుతుందని అని చెప్పుకొచ్చారు. తమ పార్టీని మునుగోడు ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మునుగోడు ఉప ఎన్నిక పై అందరి దృష్టి ప్రధానంగా నెలకొంది. మునుగోడులో విజయకేతనాన్ని ఎగరవేయడం కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరికి వారు మునుగోడు ను కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఇక ఇదే సమయంలో మునుగోడు రాజకీయాల్లో వేలు పెట్టిన కేఏ పాల్ ఇప్పటికే మునుగోడులో వరాలు ప్రకటించేశారు. మునుగోడులో తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని, మునుగోడులో ప్రజాశాంతి పార్టీ గెలిచిన ఆరు నెలల్లో 50వేల ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు ఉచిత విద్యను అందిస్తామని హామీలు గుప్పించేశారు. మునుగోడులోని ప్రతి గ్రామంలో తన చారిటీ ద్వారా ఉద్యోగాలు ఇస్తానని ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.