Munugode ByPoll : మునుగోడుపై బీజేపీ దూకుడు.. రేపు తెలంగాణకు తరుణ్ చుగ్

మునుగోడుపై బీజేపీ దూకుడు పెంచింది. శుక్రవారం తెలంగాణకు తరుణ్ చుగ్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొననున్నారు. మునుగోడులో ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ తీసే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు చేరికల కమిటీతో తరుణ్ చుగ్ సమావేశం కానున్నారు.

Munugode ByPoll : మునుగోడుపై బీజేపీ దూకుడు.. రేపు తెలంగాణకు తరుణ్ చుగ్

Munugode bypoll schedule

Munugode ByPoll : మునుగోడుపై బీజేపీ దూకుడు పెంచింది. శుక్రవారం తెలంగాణకు తరుణ్ చుగ్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొననున్నారు. మునుగోడులో ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ తీసే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు చేరికల కమిటీతో తరుణ్ చుగ్ సమావేశం కానున్నారు.

ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరే వారి లిస్టుపై తరుణ్ చుగ్ చర్చించనున్నారు. ప్రజా సమస్యల అధ్యయన కమిటీతోనూ తరుణ్ చుగ్ సమావేశం కానున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. దూకుడు పెంచింది. ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.

ED Rides in TRS Leaders : ఈడీ రాడార్ లో టీఆర్ఎస్ నేతలు..త్వరలోనే రైడ్స్ జరుగుతాయి : ఎమ్మెల్యే రాజాసింగ్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక రాబోతోంది. ఈ బైపోల్ లో గెలిచేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ సీటును గెలచుకుని తెలంగాణ రాజకీయాల్లో తమ ఆధిపత్యం రాబోతోందని చెప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే.. తెలంగాణలో ఇప్పటికీ తమదే పైచేయి అని నిరూపించేందుకు అధికార టీఆర్ఎస్ యత్నిస్తోంది. అదే సమయంలో తెలంగాణలో మళ్లీ పుంజుకునేందుకు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇందుకోసం మునుగోడు ఉపఎన్నికను ఉపయోగించుకోవాలని.. ఇక్కడ తమ సర్వశక్తులు ఒడ్డాలని చూస్తోంది.

Telangana BJP in-charge Sunil Bansal : తెలంగాణ బీజేపీ వ్యహారాల ఇంచార్జ్ గా సునీల్ బన్సల్

తెలంగాణలోని అతికొద్ది నియోజకవర్గాల్లో ఒకప్పుడు బలంగా ఉన్న సీపీఐకి.. ఒకప్పుడు మునుగోడు నియోజకవర్గం కంచుకోట. ఇక్కడ ఆ పార్టీ 6 సార్లు గెలిచింది. దీన్ని బట్టి మునుగోడులో ఆ పార్టీకి బలం ఉందని అర్థమవుతోంది. ప్రస్తుతం తరుణంలో ఆ పార్టీకి బలం, ప్రజాదరణ తగ్గినా.. బలమైన మునుగోడులో ఆ పార్టీకి ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంటుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే ఇక్కడ పోటీ చేసే అంశంపై సీపీఐ ఆలోచన చేస్తోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అయితే మూడు బలమైన పార్టీలను ఎదుర్కొని సీపీఐ తమ సత్తా చాటడం అంత సులువు కాదు. కాగా, ఇక్కడ బరిలో నిలిచి తమ ఉనికి చాటుకోవాలని సీపీఐ భావిస్తోంది. మరోవైపు సీపీఐ బరిలో ఉండటం వల్ల టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది.