Munugode Bypoll: ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో జాప్యం.. అనుమానాస్పదంగా సీఈవో వైఖరి: బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో అనుమానాస్పదంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. టీఆర్ఎస్ కు లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయడం లేదని అన్నారు. బీజేపీకి లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను సీఈవో వెల్లడించడం లేదని బండి సంజయ్ కుమార్ అన్నారు.

Munugode Bypoll: ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో జాప్యం.. అనుమానాస్పదంగా సీఈవో వైఖరి: బండి సంజయ్

bandi sunjay

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో అనుమానాస్పదంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. టీఆర్ఎస్ కు లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయడం లేదని అన్నారు. బీజేపీకి లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను సీఈవో వెల్లడించడం లేదని బండి సంజయ్ కుమార్ అన్నారు.

మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జరిగిన జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని బండి సంజయ్ ప్రశ్నించారు.

మీడియా నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదు? అని బండి సంజయ్ అన్నారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ చెప్పారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో రౌండు రౌండుకి అభ్యర్థుల ఆధిక్యత మారుతుండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..