Munugode bypoll: తారస్థాయికి మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం.. నేడు కేటీఆర్ రోడ్ షో

తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరింది. కీలక నేతలు రంగంలోకి దిగారు. నేడు నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు రోజులు రోడ్ షో నిర్వహించారు. నేడు సంస్థాన్ నారాయణపురంలో బండి సంజయ్ రోడ్ షో నిర్వహిస్తారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే మకాం వేసి అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నారు.

Munugode bypoll: తారస్థాయికి మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం.. నేడు కేటీఆర్ రోడ్ షో

Munugode Bypoll

Munugode bypoll: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరింది. కీలక నేతలు రంగంలోకి దిగారు. నేడు నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు రోజులు రోడ్ షో నిర్వహించారు. నేడు సంస్థాన్ నారాయణపురంలో బండి సంజయ్ రోడ్ షో నిర్వహిస్తారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే మకాం వేసి అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు. ఈ నెలాఖరులో సీఎం కేసీఆర్ తో చండూరులో భారీ సభకు టీఆర్ఎస్ సన్నాహకాలు చేస్తోంది. మరోవైపు, మునుగోడు ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. యుగ తులసి పార్టీకి చెందిన శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తునే కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.

రోడ్ రోలర్ గుర్తు కేటాయింపుపై టీఆర్ఎస్ ఆందోళనలకు దిగుతోంది. రోడ్డు రోలర్ తొలగించి బేబీ వాకర్ ను గుర్తును కేటాయించిన ఆర్ఓ జగన్నాథరావుపై ఈసీ వేటు వేసింది. నూతన ఆర్వోగా రోహిత్ సింగ్ ను నియమించింది. ఆదేశాలు వెలువడిన వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు ఆర్వోగా రోహిత్ సింగ్ పనిచేశారు.

టీఆర్ఎస్ ను ఆయా గుర్తులు టెన్షన్ పెడుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యంతరాలు చెబుతున్న నాలుగు గుర్తులు మొదటి ఈవీఎంలోనే ఉన్నాయి. గుర్తుల ప్రచారానికి పది రోజులే మిగిలి ఉండడంతో విస్తృత ప్రచారంపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..