Munugode Bypoll: ఓట్ల లెక్కింపులో జాప్యంపై టీఆర్ఎస్ ఆగ్రహం.. ప్రతి రౌండు ఫలితాలు వెంటనే తెలపాలన్న జగదీశ్ రెడ్డి

రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యం జరుగుతోందని జగదీశ్ రెడ్డి చెప్పారు. అంతేగాక, మీడియాకు ముందే లీకులు ఇస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది. ఫలితాల వెల్లడిలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని నిలదీసింది. కాగా, ఎప్పటికప్పుడు ఫలితాలు ఎందుకు వెల్లడించడం లేదని బీజేపీ-టీఆర్ఎస్ రెండు పార్టీలూ ప్రశ్నిస్తుండడం గమనార్హం.

Munugode Bypoll: ఓట్ల లెక్కింపులో జాప్యంపై టీఆర్ఎస్ ఆగ్రహం.. ప్రతి రౌండు ఫలితాలు వెంటనే తెలపాలన్న జగదీశ్ రెడ్డి

Jagadish Reddy Kishan Reddy

Munugode Bypoll: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు వేళ ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందని టీఆర్ఎస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఇప్పటికే బీజేపీ అభ్యంతరాలు తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు.

అలాగే, ఈ ఎన్నిక ఫలితాల విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అన్నారు. ఇప్పుడు తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఫలితాల వెల్లడిలో జాప్యంపై స్పందిస్తూ మండిపడ్డారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. అంతేగాక, మీడియాకు ముందే లీకులు ఇస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది.

ఫలితాల వెల్లడిలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని నిలదీసింది. కాగా, ఎప్పటికప్పుడు ఫలితాలు ఎందుకు వెల్లడించడం లేదని బీజేపీ-టీఆర్ఎస్ రెండు పార్టీలూ ప్రశ్నిస్తుండడం గమనార్హం. ఇప్పటివరకు ఐదు రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యాయి. టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. చివరి రౌండ్ ఫలితం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలలోపు విడుదల అయ్యే అవకాశం ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..