దేవాలయంలో ముస్లింకు అక్షరభ్యాసం

చదువుల తల్లి కొలువైన బాసర సరస్వతి అమ్మవారి సన్నిధి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. దేవాలయంలో ముస్లిం అబ్బాయికి అక్షరభ్యాసం చేశారు.

  • Published By: veegamteam ,Published On : September 8, 2019 / 06:04 AM IST
దేవాలయంలో ముస్లింకు అక్షరభ్యాసం

చదువుల తల్లి కొలువైన బాసర సరస్వతి అమ్మవారి సన్నిధి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. దేవాలయంలో ముస్లిం అబ్బాయికి అక్షరభ్యాసం చేశారు.

చదువుల తల్లి కొలువైన బాసర సరస్వతి అమ్మవారి సన్నిధి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. దేవాలయంలో ముస్లిం అబ్బాయికి అక్షరభ్యాసం చేశారు. శనివారం (సెప్టెంబర్ 7, 2019) నిర్మల్‌ జిల్లాకు చెందిన ముస్లిం కుటుంబ సభ్యులు బాసర సరస్వతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో తమ బాలుడికి అక్షరాభ్యాసం చేయించారు.

కొన్నేళ్లుగా తాము అమ్మవారిని దర్శించుకుంటున్నామని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకే ఇక్కడ అక్షరభ్యాసం చేయించామని తెలిపారు. దీంతో ఆ కుటుంబం అందరికీ ఆదర్శనీయంగా నిలిచింది. ఇది హిందూ ముస్లీంల ఐక్యమత్యానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. దీంతో వివిధ మతస్తుల మధ్య స్నేహభావం పెంపొందుతుందని అంటున్నారు.