Mutant Coronavirus Strain : ప్రజలు జాగ్రత్తగా ఉండాలి- ఈటెల

Mutant Coronavirus Strain : ప్రజలు జాగ్రత్తగా ఉండాలి- ఈటెల

Mutant Coronavirus Strain : కొత్త కరోనాతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయ్యింది. సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఈటెల సూచించారు. బయటి దేశాల నుంచి వస్తున్న వారందరికీ టెస్టులు చేస్తామని, ఎయిర్ పోర్టులోనే టెస్టులు నిర్వహించి..ఐసోలేషన్‌కు పంపిస్తామన్నారు. పాజిటివ్ వస్తే..మాత్రం ఖచ్చితంగా ఆసుపత్రిలో చేరాలని ఆయన సూచించారు. అన్ని రకాల పండుగలను పెద్ద ఎత్తున నిర్వహించకపోవడం మంచిదనే ఉద్దేశ్యంతో..తాము పలు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. క్రిస్మస్ వేడుకలను కూడా అదే విధంగా నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. కరోనా ఒక సవాల్‌గా మారిందని, దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత…అనేక మంది చనిపోయినా..గుండె ధైర్యంతో ముందుకు వెళ్లడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ వేవ్ లేదని, చల్లటి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో కరోనా పెరిగే అవకాశం ఉందన్నారు. చలితో పాటు కరోనా పొంచి ఉంది కాబట్టి..ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. సకాలంలో వ్యాక్సిన్ వచ్చే వీలుందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన.

కొత్త కరోనాతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. భారతదేశంలోని పలు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. అన్ని ఎయిర్ పోర్టుల్లో రికార్డులు పరిశీలిస్తున్నాయి పలు దేశాలు. భారత్‌లో కేంద్రం నివారణ చర్యలు చేపడుతోంది. బ్రిటన్ నుంచి ఎవరెవరు వచ్చారనే అనే దానిపై ఆరా తీస్తున్నారు. వారి నుంచి తీసుకున్న నమూనాలను పూణె ల్యాబ్‌కు పంపించారు. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారిపై వైద్య అధికారులు దృష్టి సారించారు. బ్రిటన్, యూకే, బెల్జియం, ఇటలీ, జర్మనీ, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 09వ తేతదీ వరకు తెలంగాణ గడ్డపై కాలు మోపిన వారందరూ హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.