Pudding And Mink : డ్రగ్స్ కేసుతో నా కూతురికి సంబంధం లేదు.. ఆ పబ్ ఆమెది కాదు – రేణుకా చౌదరి

అసలు రైడింగ్ జరుగుతున్న సమయంలో పుడ్డింగ్ మరియు మింక్ వద్ద లేనట్లు తెలిపారు. కుమార్తె తేజస్విని చౌదరి గురించి అని కొన్ని మీడియా సంస్థలలో తప్పుడు వార్తలు ప్రసారం అయ్యాయని...

Pudding And Mink : డ్రగ్స్ కేసుతో నా కూతురికి సంబంధం లేదు.. ఆ పబ్ ఆమెది కాదు – రేణుకా చౌదరి

Renuka

Pudding And Mink Pub Owner : నా కూతురు ఫుడ్డింగ్, మింక్‌‌ల యజమాని కాదని…ఈ స్థాపన నిర్వహణలో ఆమె పాలుపంచుకోలేదని..రైడ్ లో భాగంగా ఆమెను పోలీసులు అదుపులో తీసుకోలేదని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి వెల్లడించారు. తన కూతురు తేజస్విని చౌదరిపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు వ్యవహారం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పబ్ ను తేజస్విని చౌదరి స్థాపించారని వార్తలు వెలువడ్డాయి. రైడ్ సమయంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఈ విషయంలో రేణుకా చౌదరి స్పందించారు. 2022, ఏప్రిల్ 03వ తేదీ ఆదివారం మీడియాతో మాట్లాడారు. 2022, ఏప్రిల్ 2, రాత్రి హైదరాబాద్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఉన్న బార్, పుడ్డింగ్ మరియు మింక్‌పై పోలీసుల దాడికి సంబంధించి తన కుమార్తె వచ్చిన ఆరోపణలు అన్ని పూర్తిగా అవాస్తవమని తేల్చారు.

Read More : Rahul Sipligunj : నేను ఏ పరీక్షకైనా సిద్దమే.. రాడిసన్ ఘటనపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్..

అసలు రైడింగ్ జరుగుతున్న సమయంలో పుడ్డింగ్ మరియు మింక్ వద్ద లేనట్లు తెలిపారు. కుమార్తె తేజస్విని చౌదరి గురించి అని కొన్ని మీడియా సంస్థలలో తప్పుడు వార్తలు ప్రసారం అయ్యాయని వెల్లడించారు. జరిగిన దాడిలో భాగంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారనే వచ్చిన ప్రసారాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఏ ప్రకటనలు ఏవీ నిజం కాదు. అన్ని అసత్యాలన్నారు. సెన్సేషనల్ రిపోర్టింగ్‌లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లను ప్రస్తావించి, లాగడానికి ముందు మీడియా సంస్థలు ప్రాథమిక పాత్రికేయ ప్రమాణాలను పాటించాలని సూచిస్తున్నట్లు తెలిపారు. వాస్తవాలు తెలుసుకుని ప్రసారం చేయాలన్నారు రేణుకా చౌదరి.

Read More : Pudding And Mink : పేరుకేమో ఆయుర్వేదిక్‌ బార్‌.. లోపల జరిగేదే వేరు, బట్టబయలైన నిజస్వరూపం

బంజారాహిల్స్‌ రాడిసన్ హోటల్‌లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌ను ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కుమార్తె నిర్వహిస్తున్నారని వార్తలు వచ్చాయి. గతంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు పబ్ నిర్వహకురాలు తేజస్విని చౌదరి ఇంటర్వూ ఇచ్చిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమ పబ్‌ ఆయుర్వేదిక్ కాక్‌టైల్స్‌కు కేరాఫ్ అంటూ ఆమె అందులో చెప్పుకొచ్చారు. నో హ్యాంగోవర్ డ్రింగ్స్ సర్వ్ చేస్తామని, ఏ క్లాస్ కస్టమర్ల కోసమే స్పెషల్‌గా నడిచే పబ్ అంటూ పుడ్డింగ్ అండ్ మింక్‌ గురించి ఆమె చెప్పారు.
పబ్‌లో డ్రగ్స్ కేసు విచారణలో దూకుడుగా వ్యవహరిస్తున్న పోలీసులు… ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు.

Read More : Banjarahills Police : బంజారాహిల్స్ పీఎస్‌‌కు కొత్త సీఐ.. ఈయన ఎవరు ?

మరో ఇద్దరిని విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడిది..? మీకు ఎవరూ సరఫరా చేశారు..? అన్న దానిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూపీ లాగుతున్నారు. నలుగురిని అరెస్ట్ చేసిన అనంతరం వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అరెస్టైన వారిలో పబ్‌ నిర్వాహకుడు అభిషేక్‌, ఈవెంట్ మేనేజర్ అనిల్ ఉన్నారు. ఈ కేసులో మరింత పురోగతి సాధించేందుకు హైదరాబాద్‌ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఏసీపీ నర్సింగ్ రావు, వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ శ్రీనాథ్ రంగంలోకి దిగి కేసు విచారణ చేస్తున్నారు. మరోవైపు…డ్రగ్స్ ఘటన కలకలం రేపిన కాసేపటికే బంజారాహిల్స్ సీఐ శివచంద్రను… సీపీ సీవీ ఆనంద్‌ సస్పెండ్ చేయగా, ఏకంగా ఏసీపీకి మెమో జారీ చేశారు. కొత్త సీఐగా నాగేశ్వర్‌రావును నియమించారు. గత ఆరేళ్లలో టాస్క్‌ఫోర్స్‌లో నాగేశ్వర్‌రావు కీలక పాత్ర పోషించారు. పలు డ్రగ్స్ రాకెట్లను బట్టబయలు చేశారు నాగేశ్వర్‌రావు.