My Home Bhuja Temple : మై హోం భూజా దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవం..

హైదరాబాద్ నగరంలో మైహోం గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మైహోం భూజా దేవాలయ ప్రారంభోత్సవం వైభోవంగా జరుగుతోంది. బుధవారం (జూన్ 24,2021) నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు కన్నుల పండగా జరుగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారివారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.

My Home Bhuja Temple : మై హోం భూజా దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవం..

My Home, Bhuja Temple (1)

My Home Bhuja Temple : హైదరాబాద్ నగరంలో మైహోం గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మైహోం భూజా దేవాలయ ప్రారంభోత్సవం వైభోవంగా జరుగుతున్నాయి. బుధవారం (జూన్ 24,2021) నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు కన్నుల పండగా జరుగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారివారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. మైహోం భూజా దేవాలయ ప్రారంభోత్సవం కార్యక్రమాలను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి పర్యవేక్షిస్తున్నారు. చిన్నజీయర్ స్వామివారికి మైహోం గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు..కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన త్రివిక్రమ మూర్తి అవతారంలో స్వామివారు మైహోం భూజా దేవాలయంలో కొలువుతీరనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం 7.30 గంటల నుంచి యాగశాలలో నిత్యారాధన, దిరుప్పావై గోష్టి వంటి పూజాధికాలు నిర్వహించారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, క్షీరాధివాస, జలాధివాసం జరిగాయి. రేపు వాస్తుహోమం, జలోద్ధరణ వంటి పూజాకార్యక్రమాలు జరుగనున్నాయి. అలాగే ఎల్లుండి యాగశాలలో నిత్యవిధి ఆరాధన, తీర్థప్రసాద గోష్టిమూల మంత్ర హవనం జరుగనున్నాయి. ఇలా మొత్తంగా మైహోం భూజా దేవాలయం ప్రారంభోత్సవం కార్యక్రమాలు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి.