TS politics: తెలంగాణలో పొలిటికల్ హీట్.. రాష్ట్రానికి నేడు నడ్డా, రేపు రాహుల్ రాక..

తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. ఒకపక్క ఎండలు దంచికొడుతుంటే.. మరోపక్క జాతీయ పార్టీల అగ్రనేతలు తెలంగాణలో పర్యటనకు రానుండటంతో పొలిటికల్ హీట్ మొదలైంది. రాష్ట్రంలో నేడు..

TS politics: తెలంగాణలో పొలిటికల్ హీట్.. రాష్ట్రానికి నేడు నడ్డా, రేపు రాహుల్ రాక..

Rahul And Jp Nadda

TS politics: తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. ఒకపక్క ఎండలు దంచికొడుతుంటే.. మరోపక్క జాతీయ పార్టీల అగ్రనేతలు తెలంగాణలో పర్యటనకు రానుండటంతో పొలిటికల్ హీట్ మొదలైంది. రాష్ట్రంలో నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనుండగా, రేపు, ఎల్లుండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. వీరి పర్యటనల్లో భాగంగా బహిరంగ సభతో పాటు పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయా రాష్ట్ర పార్టీల నాయకత్వాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టారు. ఏప్రిల్ 14న గద్వాల జిల్లాలో ప్రారంభమైన పాదయాత్ర వనపర్తి, నారాయణపేట జిల్లాల మీదుగా మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ‘ జనం గోస – బీజేపీ భరోసా’ పేరుతో భారీ బహిరంగ సభను బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు.

JP Nadda in Telangana: ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’ పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ: హాజరు కానున్న జేపీ నడ్డా

తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ రోజు(గురువారం) మధ్యాహ్నం 12.40 గంటలకు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బీజేపీ కార్యాలయంలో బేరర్స్‌తో జేపీ నడ్డా సమావేశం కానున్నారు. సాయంత్రం 6గంటల నుంచి 8గంటల వరకు మహబూబ్ నగర్‌లో జనం గోస – బీజేపీ భరోసా పేరుతో నిర్వహించే సభలో జేపీ నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు. అదేవిధంగా మరుసటి రోజే (శుక్రవారం) తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు పలు పార్టీ కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొంటారు. రాహుల్ రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు ఏర్పాట్లు చేశారు. మే 6న సాయంత్రం 4గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్ చేరుకుంటారు. శంషాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో వరంగల్ జిల్లాకు వెళ్తారు. అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘రైతు సంఘర్షణ’ సభలో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు.

TS high court: విశ్వ విద్యాలయాల్లో రాజకీయాలా? ఓయూ రిజిస్ట్రార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

సభ అనంతరం రాహుల్ రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు చేరుకొని దుర్గం చెరువు పక్కనే ఉన్న కోహినూర్ హోటల్‌లో బస చేస్తారు. మే7న ఉదయం కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి అదే హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. అనంతరం సంజీవయ్య పార్కులో సంజీవయ్య విగ్రహానికి నివాళులర్పిస్తారు. అనంతరం గాంధీ భవన్‌లో 200 మంది ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తారు. అక్కడే డిజిటల్ మెంబర్ షిప్ ఫొటో సెషన్‌లో రాహుల్ పాల్గొంటారు. మధ్యాహ్నం సమయంలో తెలంగాణ అమరవీరులతో కలిసి భోజనం చేస్తారు. సాయంత్రం 4గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ పయమవుతారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర పాటు సమయం ఉన్నప్పటికీ తెలంగాణలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. ఎన్నికల వాతావరణంను తలపించేలా జాతీయ, ప్రాంతీయ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కృషి చేస్తుండగా, మరోసారి అధికారంను నిలబెట్టుకొనేలా తెరాస పావులు కదుపుతుంది. మొత్తానికి మూడు పార్టీల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ తో తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొంది.