Niharika Konidela : నాగబాబు కూతురు నిహారిక భర్తపై ఫిర్యాదు వాపసు

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసుల సమక్షంలో చైతన్య, అపార్ట్ మెంట్ వాసుల మధ్య రాజీ కుదిరింది.

Niharika Konidela : నాగబాబు కూతురు నిహారిక భర్తపై ఫిర్యాదు వాపసు

Niharika Konidela

Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసుల సమక్షంలో చైతన్య, అపార్ట్ మెంట్ వాసుల మధ్య రాజీ కుదిరింది. అపార్ట్ మెంట్ వాసులు తమ ఫిర్యాదుని వెనక్కి తీసుకున్నారు. చైతన్య కూడా తన ఫిర్యాదు వాపసు తీసుకున్నాడు.

కొన్ని రోజులుగా నాగబాబు అల్లుడు చైతన్య Tancica అపార్ట్ మెంట్ లో ఉండేవాడు. వచ్చిన ప్రతిసారీ హంగామా సృష్టిస్తున్నాడని అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్ మెంట్ వాసులు కూడా తనను ఇబ్బంది పెడుతున్నారని చైతన్య రిటన్ కంప్లెయింట్ ఇచ్చాడు. ఇరువురి నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ తర్వాత పోలీసుల సమక్షంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. ఇరువురూ తమ ఫిర్యాదులు వెనక్కి తీసుకున్నారు.

నిహారిక ఇంట్లో అర్థరాత్రి పెద్ద గొడవ జరిగింది. కేకలు వినిపించాయి. దీంతో ఏం జరిగిందోనని అపార్ట్ మెంట్ వాసులు నిహారిక ఇంటికి వెళ్లారు. వారిపై చైతన్య మండిపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చైతన్య న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైతన్య కూడా వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగబాబు అల్లుడు కావడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.

నిహారిక, గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యను పెళ్లాడింది. గతేడాది డిసెంబర్ లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఈ జంట హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ అపార్ట్ మెంట్‌లో నివాసం ఉంటోంది.