Nagarajuna Sagar bypoll : రాజకీయాలకు విరామం ప్రకటించిన జానారెడ్డి..సాగర్ లో కాంగ్రెస్ పరాజయం

Nagarajuna Sagar bypoll : రాజకీయాలకు విరామం ప్రకటించిన జానారెడ్డి..సాగర్ లో కాంగ్రెస్ పరాజయం

Jana

Nomula Bhagat Wins : కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ గా ఉన్న జానారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నట్లు, ఇందుకు కారణం…వయస్సు రీత్యా అని వెల్లడించారాయన. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు 89 వేల 804 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 70 వేల 932 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి 7 వేల 676, టీడీపీ అభ్యర్థికి 1,714 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సందర్భంగా జానారెడ్డి మీడియాతో మాట్లాడారు.

సాగర్ ఉప ఎన్నికల్లో తనకు ఓట్లు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. గెలిచిన నోముల భగత్‌కు అభినందనలు తెలియచేస్తునట్లు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు, టీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా 10 శాతమేనని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ కు గట్టపోటీనిచ్చామన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏం కోల్పోలేదన్నారు. ప్రజాస్వామ్య విలువల కోసం పోటీ చేశానన్నారు.

Read More : Tirupati Lok Sabha : తిరుపతిలో వైసీపీ ఘన విజయం..గురుమూర్తి ఎవరు ?