CPI Support to TRS: టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన సీపీఐ

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంపై సీపీఐ(ఎం) ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఓ వైపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీపీఐ నేతలు టీఆర్ఎస్ కు మద్దతు పలకడం విస్మయం కలిగిస్తుంది.

CPI Support to TRS: టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన సీపీఐ

Cpi Support To Trs

CPI Support To TRS: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంపై సీపీఐ(ఎం) ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఓ వైపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీపీఐ నేతలు టీఆర్ఎస్ కు మద్దతు పలకడం విస్మయం కలిగిస్తుంది. నోముల నరసింహయ్య మృతితో నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది.

టీఆర్ఎస్ పార్టీ నరసింహయ్య కుమారుడు నోముల భరత్ కు సీటు కేటాయించింది. ఇక భరత్ కు సీపీఐ (ఎం) మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు జోరుమీదున్నారు. తాము మద్దతు ఇస్తున్న విషయాన్నీ సీపీఐ(ఎం) నేతలు సోమవారం ప్రకటించారు. నోముల భరత్ కమ్యూనిస్ట్ వారసత్వం పుణికిపుచ్చుకున్న వ్యక్తి అని అందుకే తనకు తమ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. భరత్ విజయం కోసం తాము కృషి చేస్తామని వివరించారు.

ఈ విషయమై సోమవారం కమిటీ సమావేశం కాగా.. కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇక ఇదిలా ఉంటే సాగర్ లో ఏప్రిల్ 17 న ఎన్నికల పోలింగ్ జరగనుంది. సాగర్ బరిలో హేమాహేమీలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రాజకీయ కురువృద్ధుడు జానారెడ్డి బరిలో ఉండగా, బీజేపీ నుంచి డాక్టర్ రవి నాయక్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలిచి తీరాలని అనుకుంటుంది.

ఇక ఇప్పటికే సాగర్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ నేతలు కలియదిరిగారు. 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యే సాగర్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రులు కూడా సాగర్ బాట పట్టారు. ప్రచారానికి రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారం వేగం మరింత ఉదృతం చేశారు.