Sagar Left Canal Breached : సాగర్ ఎడమ కాలువకు గండి.. ముంచెత్తిన వరద.. భారీగా పంట నష్టం

సాగర్ ఎడమ కాలువకు గండిపడటంతో భారీగా పంటనష్టం జరిగింది. సమీపంలో ఉన్న వందల ఎకరాల్లో ఇసుక, రాళ్లు మేట వేశాయి. ఓవైపు పంటనష్టం వాటిల్లడం, మరోవైపు ఎడమ కాలువకు 20 రోజుల వరకు నీటి నిల్వ నిలిచిపోవడంతో ఇప్పటికే నాట్లు వేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Sagar Left Canal Breached : సాగర్ ఎడమ కాలువకు గండి.. ముంచెత్తిన వరద.. భారీగా పంట నష్టం

Sagar Left Canal Breached : సాగర్ ఎడమ కాలువకు గండిపడటంతో భారీగా పంటనష్టం జరిగింది. సమీపంలో ఉన్న వందల ఎకరాల్లో ఇసుక, రాళ్లు మేట వేశాయి. ఓవైపు పంటనష్టం వాటిల్లడం, మరోవైపు ఎడమ కాలువకు 20 రోజుల వరకు నీటి నిల్వ నిలిచిపోవడంతో ఇప్పటికే నాట్లు వేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కృష్ణా నదికి పెరుగుతున్న వరదతో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడింది. దీంతో ఒక్కసారిగా పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. అకస్మాత్తుగా పడిన గండి భారీ పంట నష్టాన్ని మిగల్చాగా, పలుచోట ఇల్లు నీట మునిగాయి. నాగార్జున సాగర్ ఎడమకాలువకు గండిపడడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నిడమానూరు మండలం ముప్పారం 39వ కిలోమీటర్ వద్ద సాగర్ ప్రాజెక్టుకు గండిపడింది.

సమీపంలో ఉన్న గ్రామాల్లోకి వరద ముంచెత్తింది. లక్ష్మీదేవి గూడెం, నిడమనూరు, ముప్పారం గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ వరద ఉధృతికి జలమయం అయ్యాయి. గండిపడిన సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్, ప్రాజెక్ట్ అధికారులు హాలియా వద్ద ఉన్న ఎడమ కాలువ వద్ద వాటర్ డైవర్షన్ చేశారు.