Sagar Bypoll : ఎన్నికలు వస్తే..ఆగమాగం కావొద్దు – కేసీఆర్

నాగార్జున సాగర్ కు త్వరలోనే డిగ్రీ కాలేజీ వస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. నోముల భగత్ ను మంచి మెజార్టీతో గెలిపించాలని, ఎన్నికలు వస్తే..ఆగమాగం కావొద్దని ప్రజలకు సూచించారు.

Sagar Bypoll : ఎన్నికలు వస్తే..ఆగమాగం కావొద్దు – కేసీఆర్

Sagar Bypoll

CM Kcr Haliya Meeting : నాగార్జున సాగర్ కు త్వరలోనే డిగ్రీ కాలేజీ వస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. నోముల భగత్ ను మంచి మెజార్టీతో గెలిపించాలని, ఎన్నికలు వస్తే..ఆగమాగం కావొద్దని ప్రజలకు సూచించారు. ఉప ఎన్నికల భాగంగా..హాలియాలో టీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించారు. మంచి పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎవరు గెలిస్తే..మంచిదో..నియోజకవర్గం అభివృద్ధి అవుతుందో..ఇప్పటికే ప్రజలకు అవగాహన వచ్చి ఉందన్నారు.

ప్రజా పోరాటాల్లో పనిచేసిన వ్యక్తి నోముల నర్సింహయ్య చనిపోవడం తనకు బాధగా ఉందని, విద్యావంతుడు నోముల కొడుకు నోముల భగత్ ను బరిలోకి దింపడం జరిగిందన్నారు. భగత్ కు ఓట్లు దుంకుతయో..లిఫ్ట్ ద్వారా నీళ్ళు దుంకుతయ్ అనే హామీనిస్తున్నట్లు చెప్పారు. ఆర్డీఎస్ కాల్వ ఆగమైపోతే..ఓ లిప్ట్ పెట్టినట్లు తెలిపారు. గత పరిపాలకులు వదిలిపెట్టిన తిరుమలగిరి సాగర్ మండలం లిఫ్ట్ పనులు త్వరగానే పూర్తి చేస్తామన్నారు. 30 ఏళ్లు..60 ఏళ్లు చరిత్ర అంటూ జానారెడ్డి ఏదో ఏదో మాట్లాడుతున్నారని, గతంలో నందికొండను వదిలివేశారని, తాము మున్సిపాల్టీని చేయడం జరిగిందని, జాగాల సమస్య త్వరగానే పరిష్కారం చేస్తానని హామీనిచ్చారు. నందికొండలో గురుకుల పాఠశాలగా ఉన్న స్కూల్ కు డిగ్రీ కాలేజీకి అనుమతినిస్తామన్నారు సీఎం కేసీఆర్.

Read More : Deliver Free Food : కరోనా రోగులకు ఫ్రీగా భోజనం, ట్వీట్ వైరల్