Nagole Gold Theft Case : దొంగలు దొరికారు.. నాగోల్ కాల్పుల కేసులో పురోగతి, పక్కా స్కెచ్ ప్రకారమే దోపిడీ

తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ కే సవాల్ విసిరిన చోరగాళ్లు దొరికారు. నాగోల్ లో బంగారం షాపులో కాల్పులు జరిపి గోల్డ్ ఎత్తుకెళ్లిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Nagole Gold Theft Case : దొంగలు దొరికారు.. నాగోల్ కాల్పుల కేసులో పురోగతి, పక్కా స్కెచ్ ప్రకారమే దోపిడీ

Nagole Gold Theft Case : తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ కే సవాల్ విసిరిన చోరగాళ్లు దొరికారు. నాగోల్ లో బంగారం షాపులో కాల్పులు జరిపి గోల్డ్ ఎత్తుకెళ్లిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి ఆధారాలు దొరక్కుండా దొంగలు పక్కా స్కెచ్ వేసినా.. సైంటిఫిక్ ఆధారాలతో తీగ లాగితే.. డొంక కదిలింది. సీసీ కెమెరాల లైవ్ ట్రాకింగ్ ద్వారా.. పోలీసులు నిందితులను గుర్తించారు.

ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మహారాష్ట్రలో ఉన్న ముగ్గురు దొంగల ఆచూకీ లభ్యమైంది. ఆలస్యం చేయకుండా హుటాహుటిన అక్కడికి వెళ్లిన హైదరాబాద్ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 1వ తేదీన రాత్రి 9గంటల ప్రాంతంలో నాగోల్ స్నేహపురి కాలనీలోని మహదేవ్ జువెలరీ షాపులో దొంగలు పడ్డారు.

ముందుగా కాల్పులు జరిపి భయకంపితులను చేశారు. ఆ తర్వాత బంగారం దోచుకెళ్లారు. దొంగల కాల్పుల్లో షాప్ ఓనర్ కల్యాణ్, బంగారం వ్యాపారి సుఖ్ రామ్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకునే లోపే దొంగలు పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.

Also Read..Nagole Gun Firing : హైదరాబాద్ నాగోల్‌లో కాల్పుల కలకలం.. కస్టమర్ల మాదిరి వచ్చి బంగారం షాపులో దోపిడీ

కాల్పుల్లో గాయపడిన కల్యాణ్, సుఖ్ రామ్ లను ఆసుపత్రికి తరలించారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో మహదేవ్ జువెలర్స్ దుకాణం వద్దకు రెండు బుల్లెట్ బైకులపై వచ్చారు నలుగురు దుండగులు. సుఖ్ రామ్ లోపలికి వెళ్లిన కాసేపటికే దుకాణంలోకి చొరబడిన ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి సుఖ్ రామ్ దగ్గరున్న బంగారం బ్యాగ్ ను దోచుకెళ్లారు.

షాప్ ఓనర్ కల్యాణ్, సుఖ్ రామ్ లు వారిని అడ్డుకునేందుకు యత్నించడంతో ఇద్దరిపై కాల్పులు జరిపారు దుండగులు. బుల్లెట్లు వారి శరీరం నుంచి దూసుకెళ్లాయి. సుఖ్ రామ్ మెడ నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో అతడి పరిస్థితి విషమంగా ఉంది.

కల్యాణ్ శరీరం నుంచి బుల్లెట్ దూసుకుపోయింది. తాను అంతకు ముందు ఎప్పుడూ నిందితులను చూడలేదని కల్యాణ్ చెబుతున్నారు. దొంగల టార్గెట్ సుఖ్ రామ్ అని, సుఖ్ రామ్ టార్గెట్ గానే కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లోనే ఓ బుల్లెట్ తనకు తగిలిందన్నారు కల్యాణ్.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రశాంతంగా ఉన్న నగరంలో కాల్పులు జరగడాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ఘటన జరిగిన మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఇందుకోసం 15 టీమ్ లు తీవ్రంగా శ్రమించాయి. కాల్పులు జరిగిన తర్వాత ఎటువంటి క్లూలు వదలకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. రెండు బుల్లెట్ బైకులపై నిందితులు వచ్చారన్న ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో కేసు దర్యాఫ్తు చేపట్టారు. షాపు సీసీటీవీ ఫుటేజీతో పాటు సమీపంలో సీసీ కెమెరా విజువల్స్ ని పరిశీలించారు.

హైదరాబాద్ లో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగి ఉండటంతో అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా పోలీసులు అనుమానించారు. ఆ దిశగా దర్యాఫ్తు చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి సుఖ్ రామ్ ను నిందితులు వెంబడించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సుఖ్ రామ్ ను ఫాలో అవుతూ వచ్చిన దుండగులు.. నాగోల్ మహదేవ్ జువెలరీ షాపు వద్ద దోపిడీకి అనుకూలంగా ఉండటంతో ప్లాన్ అమలు చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. ప్రతీ గురువారం సుఖ్ రామ్ బంగారం బ్యాగ్ తో వస్తాడని తెలిసే ముందే రెక్కీ నిర్వహించి ప్లాన్ ప్రకారం కాల్పులకు తెగబడినట్లు తేల్చారు.

Also Read..Theft In Gold Shop : OMG.. చీరను అడ్డం పెట్టుకుని జస్ట్ 20 సెకన్లలో రూ.10లక్షల గోల్డ్ నెక్లెస్‌ను ఎలా కొట్టేసిందో చూడండి..

కాల్పుల్లో గాయపడ్డ బంగారం వ్యాపారులు కల్యాణ్, సుఖ్ రామ్ లను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఘటన జరిగిన తీరును బట్టి రాజస్తాన్, హర్యానా, యూపీకి చెందిన గ్యాంగ్ సభ్యులుగా పోలీసులు అనుమానించారు. ఆ దిశగానే విచారణ చేపట్టిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. చోరీ చేసిన బైకులపై వచ్చిన దొంగలు దోపిడీకి పాల్పడ్డారు.

దోపిడీ అనంతరం వాటిని వదిలేసి వెళ్లిపోయారు. ఇది పక్కా రెక్కీగా నిర్ధారించిన పోలీసులు సికింద్రాబాద్ నుంచి స్నేహపురి కాలనీ వరకున్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల లైవ్ ట్రాకింగ్ ద్వారా పోలీసులు నిందితులను గుర్తించారు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు..అతడిచ్చిన కీలక సమాచారంతో మహారాష్ట్రలో ఉన్న మరో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.