Saroornagar Honour Killing : నా భర్తను చంపిన వాళ్లను కఠినంగా శిక్షించాలి : నాగరాజు భార్య ఆశ్రిన్‌

నాగరాజుతో పెళ్లి తన సోదరులకు ఇష్టం లేదని.. అందుకే నాగరాజును దారుణంగా హత్య చేశారన్నారు. తాను ఎప్పటికీ పుట్టినింటికి వెళ్లబోనని ఆశ్రిన్‌ అంటోంది.

Saroornagar Honour Killing : నా భర్తను చంపిన వాళ్లను కఠినంగా శిక్షించాలి : నాగరాజు భార్య ఆశ్రిన్‌

Asrin

Saroornagar Honour Killing : హైదరాబాద్ సరూర్‌‌నగర్ పరువు హత్య కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తన భర్తను చంపిన వాళ్లను కఠినంగా శిక్షించాలని నాగరాజు భార్య ఆశ్రిన్‌ డిమాండ్‌ చేశారు. నాగరాజుతో పెళ్లి తన సోదరులకు ఇష్టం లేదని.. అందుకే నాగరాజును దారుణంగా హత్య చేశారన్నారు. తాను ఎప్పటికీ పుట్టినింటికి వెళ్లబోనని ఆశ్రిన్‌ అంటోంది. తమ ప్రేమ గురించి తన అమ్మకి చెప్పానని పేర్కొన్నారు. తన అమ్మ నాగరాజు తో ఫోన్ లో మాట్లాడిందని తెలిపారు. ఫోన్ లో మాట్లాడాను అని తన అన్నయ్య తనను బాగా కొట్టాడని వెల్లడించారు. నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నించాను… కానీ తన అన్నయ్య అస్సలు వినలేదన్నారు.

జనవరి 30 రోజు ఇంట్లో నుండి వచ్చేశానని చెప్పారు. జనవరి 31 న నాగరాజు, తాను పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నారు. 10 సంవత్సరాలుగా తాము ప్రేమించుకున్నామని తెలిపారు. తన నాన్న ఉంటే కచితంగా ఈ పరిస్థితి రాకుండా ఉండేదన్నారు. ఫాస్ట్రాక్ కోర్ట్ ద్వారా తన అన్నయ్య, బావకి శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన కొడుకును దారుణంగా హత్య చేశారని నాగరాజు తల్లి అనుసుజ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తోన్నారు.

Saroornagar honour killing : సరూర్ నగర్ పరువు హత్య కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

సరూర్ నగర్ పరువు హత్య కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పథకం ప్రకారమే నాగరాజు హత్యను నిందితులు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు.. నాగరాజు మొబైల్ లో స్పైవేర్ సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసినట్లు తెలిపారు. నాగరాజు ప్రతి కదలికను మొబైల్ ద్వారా ట్రాక్ చేశారని పేర్కొన్నారు. నిందితులు రంజాన్ ఉపవాస దీక్షలో ఉండటంతో హత్య వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. దీక్ష ముగియగానే పక్కా ప్లాన్ తో నాగరాజును హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే నిందితులు సయ్యద్ మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు.

హైదరాబాద్ లో మరో పరువు హత్య జరిగింది. తమ ఇంటి కూతురు మతాంతర వివాహం చేసుకుందనే కారణంతో యువతి అన్న యువకుడిని వెంటాడి హతమార్చాడు. పెళ్లి చేసుకుని రెండు నెలలు గడుస్తుండటంతో పరిస్థితులు చక్కబడ్డాయని భావించిన ఆ యువ జంటను ఈ ఘటన తీవ్ర కల్లోలంగా మారింది. రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన నాగరాజు, అదే గ్రామానికి సమీపంలోని ఘనాపూర్‌లో ఉండే ఆశ్రిన్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ గురించి పెద్దలు ఒప్పుకోకపోగా కొన్నాళ్ల పాటు సాగిన వీరి ప్రేమకి పెద్దలు ఒప్పుకోలేదు. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ.. రెండు నెలల క్రితం 31.01.2022న ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు.

Hyderabad: దారుణం.. సరూర్‌నగర్‌లో పరువు హత్య!

ప్రముఖ కార్ల షోరూమ్‌లో సేల్స్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న నాగరాజుపై యువతి సోదరుడు పగ పెంచుకున్నాడు. రెక్కీ నిర్వహించి ప్రస్తుతం వాళ్ళు ఉండే ప్రాంతాన్ని పసిగట్టాడు. ఈ క్రమంలోనే బైక్ పై వెళ్తున్న సమయంలో గడ్డపారతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన నాగరాజు మృతి చెందాడు. విచారణలో ప్రేమ వివాహం ఇష్టం లేకనే దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.