నల్గొండ వాళ్లకు కిక్ వద్దంట

  • Published By: venkaiahnaidu ,Published On : May 6, 2020 / 03:37 PM IST
నల్గొండ వాళ్లకు కిక్ వద్దంట

తెలంగాణ అంతటా లిక్కర్ కోసం మందు బాబులు పోటీ పడుతుంటే నల్గొండ జిల్లాలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకరిద్దరు కొనుగోలు దారులు తప్ప జిల్లాలో చాలా మద్యం దుకాణాలు బోసిపోయి కనిపించాయి. కొద్దిపాటి దుకాణాల వద్ద జనాలు అరకొరగా ఉన్నారు. కొద్దిపాటి మంది భౌతిక దూరం పాటిస్తూ పద్ధతిగా మద్యం కొనుగోలు చేశారు. దాదాపు మద్యం దుకాణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.  

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మద్యం షాపుల వద్ద కొంతమేర రద్దీ నెలకొంది. అయితే క్యూ పద్ధతి, భౌతిక దూరం పాటించేందుకు ప్రతి చోట పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రతి చోట కానిస్టేబుల్, ఆయా సిబ్బంది భౌతిక దూరం కచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి నల్లొండ జిల్లాలో 277 మద్యం షాపులు ఉండగా, ఒక్క నల్గొండ జిల్లాలోనే 134 వైన్ షాపులు ఉన్నాయి. 

యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 69 వైన్ షాపులు, సూర్యపేటలో 74 వైన్ షాపులు ఉన్నాయి. యాదాద్రి జిల్లా గ్రీన్ జోన్ ఉండటంతో ఇప్పటికే వైన్ షాపులు అన్ని తెరుచుకున్నాయి. నల్గొండ జిల్లాలో కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేయడంతో అన్ని వైన్ షాపుల తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. భౌతిక దూరం కచ్చితంగా అమలయ్యేలా చూస్తున్నారు.  ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి రావాలని కోరుతున్నారు.

తెలంగాణలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. బుధవారం(మే 6,2020) ఉదయం 10గంటలకు మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 45 రోజుల తర్వాత వైన్స్‌ షాపులు తెరుచుకోవడంతో.. మందుబాబులు షాపుల ముందు క్యూ కట్టారు. బుధవారం ఉదయాన్నే మద్యం షాపుల దగ్గరికి చేరుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్ లో నిల్చున్నారు. 

తెలంగాణలో 2,200 మద్యం దుకాణాలకు గానూ కంటైన్మెంట్‌ జోన్లలోని 15 దుకాణాలు మినహాయించి మిగిలిన వాటిని ఓపెన్‌ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కాగా, తెలంగాణలోనూ మద్యం ధరలు పెరిగాయి. చీప్‌ లిక్కర్‌పై 11 శాతం, ఇతర బ్రాండ్ల 16 శాతం ధర పెంచింది. ఈ ప్రకారం కొత్త మద్యం ధరలు అమల్లోకి వచ్చాయి.